BigTV English

Indian National Anthem: పాకిస్తాన్ గడ్డపై.. ఇండియా జాతీయగీతం… గూస్ బంప్స్ రావాల్సిందే !

Indian National Anthem: పాకిస్తాన్ గడ్డపై.. ఇండియా జాతీయగీతం… గూస్ బంప్స్ రావాల్సిందే !

Indian National Anthem: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ రసవత్తర పోరులో ఎలాగైనా గెలిచి అడుగు ముందుకు వేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ చిన్న తప్పిదం జరిగింది.


సాధారణంగా మైదానంలో ఆడుతున్న మ్యాచ్ ప్లేయర్లు.. ఆ మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించడం సాంప్రదాయం. అదే సమయంలో ఆయా దేశాల జాతీయ గీతాన్ని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తారు. అయితే ఇక్కడే చిన్న తప్పిదం జరిగింది. ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మ్యాచ్ లో అనుకోకుండా భారత జాతీయ గీతాన్ని {Indian National Anthem} ప్లే చేశారు. మొదట ఇంగ్లాండ్ తమ జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత.. ఇండియన్ నేషనల్ యాంథమ్ {Indian National Anthem} ని ప్లే చేశారు. కానీ వెంటనే తప్పు తెలుసుకుని సెకండ్ల వ్యవధిలో మళ్ళీ ఆస్ట్రేలియా నేషనల్ యాంథమ్ ని ప్లే చేశారు.

దీంతో ప్రస్తుతం భారత జాతీయ గీతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో నెటిజెన్లు పాకిస్తాన్ గడ్డపై భారత జాతీయ గీతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో భారత్ ఆడకపోయినా.. మన జాతీయ గీతాన్ని {Indian National Anthem} ఎందుకు ప్లే చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 25 ఓవర్ల వద్ద రెండు వికెట్లను కోల్పోయి 168 పరుగులు చేసింది. ఆరంభంలోనే పది పరుగులు చేసిన ఫీలిప్ సాల్ట్ ని.. డ్వారిషూస్ పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత 15 పరుగులు చేసిన వికెట్ కీపర్ జేమీ స్మిత్ ని కూడా అవుట్ చేశాడు. ప్రస్తుతం బెన్ డక్కెట్ {75*}, జో రూట్ {56*} పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఇరుజట్లలోని ప్లేయింగ్ లెవెల్ వివరాల్లోకి వెళితే..


ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

ఇక ఈ టోర్నీలో భాగంగా రేపు భారత్ – పాకిస్తాన్ మధ్య ఆసక్తికర పోరు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు దుబాయ్ లోని స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×