BigTV English

Priyanka Shiv: కంటెంట్ కోసం ఈ జంట ఏమైనా చేసేలా ఉన్నారే.. 100 రోజుల్లో ఇంత మార్పా?

Priyanka Shiv: కంటెంట్ కోసం ఈ జంట ఏమైనా చేసేలా ఉన్నారే.. 100 రోజుల్లో ఇంత మార్పా?

Priyanka Shiv: ఈరోజుల్లో చాలావరకు బుల్లితెర సెలబ్రిటీలు.. యూట్యూబ్ ఛానెళ్లు ఓపెన్ చేసి యూట్యూబర్లుగా మారుతున్నారు. అలా గత కొన్నేళ్లలో ఎన్నో వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లు పుట్టుకొచ్చాయి. ఛానెల్ స్టార్ట్ చేయడం వరకు ఓకే.. కానీ దానికి వ్యూస్ రావడం ఎలా.? ఆ వ్యూస్ కోసమే ఎంత దూరమయినా వెళ్లడానికి సిద్ధపడుతున్నారు యూట్యూబర్లు. ముఖ్యంగా బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా వెళ్లొచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలుగా మారి యూట్యూబ్ ఛానెళ్లు ఓపెన్ చేశారు. వారి యూట్యూబ్ ఛానెళ్లకు చాలా డిమాండ్ ఉంది. అలాంటి వారిలో ప్రియాంక జైన్ కూడా ఒకరు. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ప్రియాంక.. అందులో కంటెంట్ క్రియేట్ చేయడం కోసం చాలా కష్టపడుతోంది.


కొత్త ప్రయోగం

ప్రియాంక జైన్ (Priyanka Jain), శివ్ (Shiv) కలిసి ‘నెవెర్ ఎండింగ్ టేల్స్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ఈ యూట్యూబ్ ఛానెల్ ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా ప్రియాంక బిగ్ బాస్‌లోకి వెళ్లొచ్చిన తర్వాత దీనికి బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కలిసి చేస్తున్న వీడియోలు కాబట్టి వీరి ఛానెల్‌కు చాలా డిమాండ్ కూడా పెరిగింది. అటు యూట్యూబ్‌లో మాత్రమే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా వీరి వీడియోలు తెగ వైరల్ అవ్వడం మొదలయ్యింది. అందుకే నెటిజన్లను మరింత ఆకట్టుకోవడం కోసం వీరి వీడియోలతో ఎంత దూరం వెళ్లడానికి అయినా ప్రియాంక, శివ్ సిద్ధపడ్డారు. అలా తాజాగా శివ్ ఒక కొత్త ప్రయోగం కూడా చేశాడు.


నెటిజన్ల కామెంట్స్

మామూలుగా 6 నెలల్లో జరగాల్సిన బాడీ ట్రాన్స్ఫార్మేషన్‌ను కేవలం 100 రోజుల్లో చేసి చూపించాడు శివ్. అసలు ఇది ఎలా సాధ్యమయ్యింది అని చెప్తూ ఒక ఫుల్ వీడియోను తమ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో తీసి పెట్టారు. ఈ జర్నీలో ప్రియాంక కూడా శివ్‌కు చాలా సాయం చేసింది. 100 రోజుల్లో ఇలా చేయడం చాలా కష్టమని, అయినా శివ్ దానిని చేసి చూపించాడని ట్రైనర్ సైతం ఆశ్చర్యపోయాడు. దీంతో ఈ వీడియో చూసి కంటెంట్ కోసం ఈ జంట ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నట్టున్నారు అంటూ చాలామంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 100 రోజుల్లో ఇంత మార్పు రావాలంటే ఫుడ్ విషయంలో శివ్ చాలా రిస్క్ తీసుకొని ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏకంగా 500 వీడియోలు, తప్పు ఒప్పుకున్న మస్తాన్ సాయి.. పూర్తి రిపోర్ట్ ఇదే

తనే ఇన్‌స్పిరేషన్

తాజాగా ప్రియాంక, శివ్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన ఈ ట్రాన్స్ఫార్మేషన్‌ వీడియోలో అర్జున్ అంబటి కూడా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. అర్జున్ ట్రైన్ అవుతున్న జిమ్‌లోనే శివ్ కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. శివ్ కష్టపడడం చూసి తన గురించి ఎంతో గర్వపడుతున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. అంతే కాకుండా తన బాయ్‌ఫ్రెండే తనకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది. తన ట్రాన్స్ఫార్మేషన్‌ గురించి మాట్లాడుతూ.. 20 ఏళ్ల నుండి ఇలా సిక్స్ ప్యాక్ చేయాలి అన్నది తన కల అని, మొత్తానికి ఆ కల ఇప్పటికీ నెరవేరిందని గర్వంగా చెప్పాడు శివ్. ఈ వీడియో చూసి కొందరు ఇన్‌స్పైర్ అవుతుంటే.. మరికొందరు మాత్రం వీడియోల కోసం మరీ ఇలా చేయాలా అంటూ నెగిటివిటీ చూపిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×