BigTV English

NZ VS SA: బ్యాటింగ్ తీసుకున్నన్యూజిలాండ్..సౌత్ ఆఫ్రికాకు నాకౌట్ సెంటిమెంట్

NZ VS SA: బ్యాటింగ్ తీసుకున్నన్యూజిలాండ్..సౌత్ ఆఫ్రికాకు నాకౌట్ సెంటిమెంట్

NZ VS SA: చాంపియన్ టోపీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగబోతుంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో సెమీఫైనల్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీఫైనల్ పూర్తయింది. ఇందులో గెలిచిన టీమిండియా నేరుగా ఫైనల్ కు వెళ్ళింది. ఇక ఇవాళ మరో సెమీ ఫైనల్ జరగబోతుంది. ఇక ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్… పాకిస్తాన్ లోని లాహూర్ గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఇందులో టాస్ నెగ్గి…  బ్యాటింగ్ తీసుకుంది న్యూజిలాండ్ టీం.


Also Read:  Steve Smith Retires: ఆస్ట్రేలియాలో కుదుపు… స్టీవెన్ స్మిత్ రిటైర్మెంట్

దీంతో మొదట బౌలింగ్ చేయబోతున్నారు సఫారీలు. ఇవాల్టి మ్యాచ్లో… మొదట బ్యాటింగ్ తీసుకున్న వారికి లాహోర్ పిచ్ అనుకూలంగా ఉంటుందని… ఈ నేపథ్యంలోనే… న్యూజిలాండ్ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 270 నుంచి 300 పరుగులు చేసే ఛాన్సులు ఉన్నాయట.ఇది ఇలా ఉండగా…. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా మొదటి సెమీఫైనల్ లో టీమిండియా గెలిచి ఫైనల్ కు చేరింది. ఇక ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు.. ఫైనల్ కు చేరుతుంది.


 

అప్పుడు గెలిచిన జట్టుతో టీమిండియా తలపడాల్సి ఉంటుంది. ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా నిర్వహించబోతున్నారు.  అయితే… ఇలాంటి ఐసీసీ టోర్నమెంటులో సౌత్ ఆఫ్రికా.. చివరి వరకు వచ్చి.. ఓడిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మొన్న టి20 వరల్డ్ కప్ సమయంలో కూడా టీమిండియా చేతిలో చిత్తయింది సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు కూడా అలాగే… ఆడితే ఇంటిదారి పట్టడమే. దీంతో ఐసీసీ టోర్నమెంట్ల సెంటిమెంట్ నేపథ్యంలో సౌత్ఆఫ్రికా ఫ్యాన్స్ భయపడుతున్నారు. మార్చి 9వ తేదీన.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 73 వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 42 మ్యాచుల్లో సౌత్ ఆఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మిగిలిన 26 మ్యాచుల్లో మాత్రమే న్యూజిలాండ్ విజయం సాధించింది. అంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.

Also Read: BCCI – IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్స్..ఇకపై ప్లేయర్స్ భార్యలపై ఆంక్షలు ?

 

దక్షిణాఫ్రికా VS న్యూజిలాండ్ జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా ( C ), రాస్సీ వాన్ డెర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మర్క్రామ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ న్గిడి

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×