BigTV English

T20 World Cup 2024 : ఇదే .. టీ 20 వరల్డ్ కప్ ఫార్మాట్ ? ఏ గ్రూప్ లో ఎవరున్నారు?

T20 World Cup 2024 : ఇదే .. టీ 20 వరల్డ్ కప్ ఫార్మాట్ ? ఏ గ్రూప్ లో ఎవరున్నారు?
T20 World Cup 2024

T20 World Cup 2024(Cricket news today telugu):

టీ 20 ప్రపంచకప్ 2024 జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోటీలు యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలపై జరగనున్నాయి. అంతేకాదు ఈసారి 20 జట్లు ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి.


అయితే ఇన్ని జట్లు ఉండటం వల్ల వీటిని నాలుగు గ్రూపులుగా విభజిస్తున్నారని సమాచారం. కొన్ని దశాబ్దాలుగా ఆ 10 జట్లతోనే క్రికెట్ ఆడుతున్నాయి. అందుకనే ఈసారి క్వాలిఫయింగ్ మ్యాచ్ లను పెట్టి కొత్తగా 10 జట్లకు స్థానం కల్పించారు. మరి వీరెన్ని సంచలనాలు స్రష్టిస్తారో వేచి చూడాల్సిందే. టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇలా ఉండవచ్చని అనుకుంటున్నారు.

ఒకొక్క గ్రూపులో అయిదేసి జట్లు ఉంటాయి. వన్డే ప్రపంచకప్ 2023 రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే. ప్రతీ జట్టు గ్రూప్ లోని అన్ని జట్లతో పోటీ పడింది. కానీ ఇక్కడ అలాకాదు… ఒక గ్రూప్ లోని జట్టు అదే గ్రూప్ లోని మిగిలిన నాలుగింటితో ఆడాల్సి ఉంటుంది. మొత్తానికి అన్ని గ్రూప్ ల నుంచి టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8కి చేరుతాయన్నమాట.


సూపర్-8లోనూ మరో రెండు గ్రూప్ లుగా విభజిస్తారన్నమాట. అప్పుడు నాలుగేసి జట్లు ఒకొక్క గ్రూప్ లో ఉంటాయి. మళ్లీ ఇందులో ని జట్టు గ్రూప్ లోని మిగిలిన మూడింటితో ఆడాల్సి ఉంటుంది. మళ్లీ ఇందులో ప్రతి గ్రూప్ లో టాప్ లో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్ కి చేరుతాయి. అక్కడ నుంచి అందరికీ తెలిసిందే. సెమీస్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ కి చేరుతుంది.

మొత్తంగా ఈ టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువ సంఖ్యలో మ్యాచులు జరగనున్నాయి. అయితే 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్-8లో నిలిచిన జట్లు మొదట క్వాలిఫై అయ్యాయి. వీటిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంకలు ఉన్నాయి. వెస్టిండీస్, యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి కాబట్టి వాటిని అతిథి జట్లుగా అవకాశం ఇచ్చారు.

టీ20 ర్యాంకింగ్స్‌ ఆధారంగా అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌ జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. కెనడా (అమెరికా క్వాలిఫయర్), పపువా న్యూ గనియా (ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్), నేపాల్, ఒమన్ (ఆసియా క్వాలిఫయర్), నమీబియా, ఉగాండా (ఆఫ్రికా క్వాలిఫయర్), ఐర్లాండ్, స్కాట్లాండ్ (యూరోప్ క్వాలిఫయర్) జట్లు కూడా టీ20 ప్రపంచకప్ 2024లో భాగం కానున్నాయి.

ఈ పొట్టి క్రికెట్ పండగ ఎన్ని సంతోషాలని తీసుకొస్తుందో, ఎన్ని విషాదాలను మోసుకొస్తుందో…మరి చూడాల్సిందే..!

Related News

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

Big Stories

×