ICC U19 Women’s T20 World Cup: ఐసీసీ మహిళల అండర్-19 టి-20 ప్రపంచ కప్ మలేషియా వేదికగా శనివారం రోజు (జనవరి 18) న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ లోని తొలి రోజు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. తొలి రోజు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలో శనివారం రోజు మొత్తం 6 మ్యాచ్ లు జరగాల్సి ఉండగా.. ఇందులో కేవలం మూడు మ్యాచ్ ల ఫలితాలు మాత్రమే వచ్చాయి. గ్రూప్ – డి లో ఆస్ట్రేలియా – స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. ఆస్ట్రేలియా విజయం సాధించింది.
Also Read: Manu Bhaker: మను భాకర్ ఇంట తీవ్ర విషాదం..!
గ్రూప్ – డి లో బంగ్లాదేశ్ – నేపాల్ జట్లు తలపడగా.. బంగ్లాదేశ్ జట్టు గెలుపొందింది. ఇక గ్రూప్ – సి లో దక్షిణాఫ్రికా – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో.. దక్షిణాఫ్రికా గెలుపొందింది. అలాగే అమెరికా – పాకిస్తాన్, నైజీరియా – సమోవా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచులు రద్దు కాగా.. ఇంగ్లాండ్ – ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అండర్ 19 ప్రపంచకప్ లోకి అడుగుపెట్టిన భారత్ గ్రూప్-ఎ లో భాగంగా తన తొలి మ్యాచ్ ని ఆదివారం వెస్టిండీస్ తో తలపడింది.
వెస్టిండీస్ – భారత్ మధ్య జరిగిన ఈ 8వ మ్యాచ్ లో భారత జట్టు భారీ విజయాన్ని సాధించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ మహిళల జట్టుకు భారత మహిళా బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా 16 పరుగులకు మించి రన్స్ చేయలేకపోయారు. ఐదుగురు వెస్టిండీస్ మహిళా బ్యాటర్లు ఏకంగా డకౌట్ గా వెనుదిరిగారు.
మరో ఇద్దరూ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు. దీంతో వెస్టిండీస్ మహిళా జట్టు 13.2 ఓవర్లకు కేవలం 44 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఒక వికెట్ నష్టానికి 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో జోషిత 2, ఆయుషి శుక్ల 2, పరిణికా సిసోడియా 3 వికెట్ల చొప్పున పడగొట్టారు.
Also Read: Abhinav Manohar: SRH చేతిలో మరో డేంజర్ ఆల్ రౌండర్.. క్యావ్యాపాప ప్లాన్ అదుర్స్ !
మరో ముగ్గురు రన్ అవుట్ గా వెనుదిరిగారు. భారత బ్యాటింగ్ లో గొంగడి త్రిష (4), కమల్ని (16*), సానిక చల్కే (18*) పరుగులు చేయడంతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ప్లేయింగ్ 11 వివరాలు: గొంగడి త్రిష, జి కమలిని (wk), సానికా చల్కే, నికి ప్రసాద్ (c), భావికా అహిరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత V J, పరుణికా సిసోడియా, షబ్నమ్ Md షకీల్, సోనమ్ యాదవ్.