Viral News: ఆమె పీహెచ్డి పూర్తి చేసింది. ఔను ఇందులో వింత ఏముంది? ఎవరైనా పూర్తి చేస్తారు. మేము కూడ పూర్తి చేశామని అనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి. ఈ మహిళ పీహెచ్డి ఏ పరిస్థితుల్లో పూర్తి చేసిందో తెలుసుకుంటే ఔరా అనాల్సిందే. ఈ మహిళ గురించి తెలుసుకున్న వారందరూ శభాష్ అంటూ తమ అభినందనలు కురిపిస్తున్నారు. ఈ మహిళ ఎవరంటే.. సౌదీ అరేబియా కు చెందిన హందా అల్ రువైలీ.
సౌదీ అరేబియా కు చెందిన హందా అల్ రువైలీ అనే మహిళకు చదువంటే ప్రాణం. బాల్యం నుండే చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉపాధ్యాయులు కూడ ఆమెను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని వెనుకాడకుండా, ఆమెకు ఉన్నత చదువులు చదివించారు. అయితే అంతలోనే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఎవరైనా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టడం సర్వసాధారణం.
అలాగే ఈమెకు 19 మంది సంతానం. తన పిల్లల బాగోగులు చూసుకొనేందుకే ఈమెకు సమయం సరిపోని పరిస్థితి. 40 ఏళ్ల వయసులో కూడా తన చదువును కొనసాగించాలని ఆమె భావించారు. అందుకు తన భర్త ప్రోత్సాహం తప్పనిసరి. అందుకు భర్త కూడ ఓకే చెప్పడంతో ఆమె తన ఆశయం వైపు సాగింది. అనుకున్నట్లే బిజినెస్ స్టడీస్ లో పీహెచ్డీ పూర్తి చేసేందుకు కళాశాలలో చేరింది. పగలు ఇంటి పనులు చేసుకుంటూ రాత్రిళ్లు పుస్తక పఠనం సాగించేది.
Also Read: Amit Shah In Vijayawada: పీఎం మోడీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే.. కేంద్ర మంత్రి అమిత్ షా
అలా చదువుపై ఉన్న మక్కువతో చివరకు అనుకున్న లక్ష్యాన్ని రువైలీ సాధించింది. పీహెచ్డి పట్టాను అందుకున్నారు. 40 ఏళ్ల వయస్సులో 19 మంది సంతానం ఉన్నప్పటికీ, రువైలీ ఉన్నత చదువును కొనసాగించడంపై స్థానికులు ఆశ్చర్యపోయారు. రువైలీ మహిళలకు ఆదర్శమని, ఆమె పట్టుదలతో చదువు డాక్టరేట్ సాధించిందని యూనివర్శిటీ అధ్యాపకులు కొనియాడారు. ఏదిఏమైనా 19 మంది సంతానం ఉన్నప్పటికీ, పీహెచ్డి పూర్తి చేయడం ఎంతైనా వండర్ కదా!