BigTV English

Internet Usage in India : ఇంటర్నెట్ వాడకంలో సీటీలనే వెనక్కి నెట్టేస్తున్న గ్రామాలు..

Internet Usage in India : ఇంటర్నెట్ వాడకంలో సీటీలనే వెనక్కి నెట్టేస్తున్న గ్రామాలు..

Internet Usage in India : ఇప్పుడు అంతా ఇంటర్నెట్ యుగమే. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్నింటికీ గూగులమ్మ సాయం తీసుకోవాల్సిందే. బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టేయాల్సిందే. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాల్లోనే ఇంటర్నెట్ వినియోగించే వాళ్లు ఎక్కువగా ఉంటారనుకునే వాళ్లం.. కానీ తాజాగా విడుదలైన ఓ నివేదిక ఆశ్చర్యకర విశేషాల్ని వెల్లడించింది. భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితుల్ని ఈ నివేదిక అద్దం పడుతోంది. ఇంతకీ.. ఈ నివేదికలో ఏముందంటే..


గతంలో గూగుల్ లో కంటెంట్ అంతా ఇంగ్లీష్ లో ఉంటుండేది.. కానీ స్థానిక భాషల్లోనూ డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగించే వాళ్లు భారీగా పెరిగిపోయారంట.  అవును.. ఈ ఏడాది చివరి నాటికి మన దేశ జనాభాలో ఇంటర్నెట్ వినియోగించే యూజర్ల సంఖ్య ఏకంగా 90 కోట్లు చేరుకోనుందంట. ఈ విషయాన్ని  ఐఏఎంఏఐ, కాంటార్‌ సంస్థలు.. ‘ది ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌ 2024’ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే.. యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 8 శాతం పెరిగినట్లు వెల్లడించింది. దీంతో.. ప్రస్తుతం భారత్ లో ఇంటర్నెట్ ని వినియోగిస్తున్న జనాభా 89 కోట్లకు చేరుకుందని మరికొన్ని నెలల్లలోనే 90 కోట్ల మార్కును దాటేస్తుందని తెలిపింది.

అంతే కాదు.. మొత్తం 130 కోట్ల జనాభాలో 90 కోట్ల జనాభా ఇంటర్నెట్ వినియోగించడం అంటే మామూలు విషయం కాదంటున్నారు విశ్లేషకులు. దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఇంటర్నెట్ ద్వారా వివిధ విషయాలకు కనెక్ట్ అవుతున్నారని.. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇదో అభివృద్ధి సూచిక అంటున్నారు. అలాగే.. ఈ మొత్తం వినియోగదారుల్లో గ్రామీణ భారత్‌లోని వినియోగదారుల సంఖ్య 48.8 కోట్లుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాగా.. ఇంటర్నెట్‌ వాడుతున్న మొత్తం జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లోని జనాభా వాటా 55 శాతంగా ఉండడం.. గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటర్నెట్ వినియోగ పెరుగుదలను స్పష్టంగా సూచిస్తోంది.


ఇటీవల కాలంలో ప్రాంతీయ భాషల్లో వెబ్ పోర్టళ్లు, న్యూస్ పోర్టళ్లు సహా చాలా సమాచారం అందుబాటులోకి వచ్చింది. భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగానికి ఇదీ ఓ కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లోని కంటెంట్ కోసం ఏకంగా 98 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. పైగా.. ఇందులో దక్షిణాధి రాష్ట్రాలైన తమిళం, తెలుగు, మళయాళం కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ భాషల్లోని అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు చాలా సంస్థలు.. వారి కంటెంట్ ను ఈ భాషల్లో ఎక్కువగా అందిస్తుండడంతో.. ఈ ప్రాంతాల్లో రీజనల్ కంటెంట్ వినియోగం భారీగా ఉంది.

గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోని ఇంటర్నెట్ వినియోగదారుల్లోనూ లోకల్ ల్యాంగ్వేజ్ లలో కంటెంట్ ని ఇష్టపడుతున్న వాళ్లు భారీగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సగానికి పైగా  అంటే దాదాపు 57% మంది ఉన్నట్లు ఈ నివేదిక తెలుపుతుండగా.. ప్లాట్‌ ఫామ్‌ల్లో స్థానిక భాషల కంటెంట్‌కు గిరాకీ పెరగడాన్ని ఇది సూచిస్తోందంటున్నారు విశ్లేషకులు.

Also Read : భారత్‌కు బైడెన్ గోల్డెన్ గిఫ్ట్.. దిగిపోయే ముందు ఊహించని నిర్ణయం..

ఇంటర్నెట్ వాడుతున్న వాళ్లల్లో మహిళల సంఖ్యా భారీగానే పెరుగుతూ పోతుంది. మొత్తం ఇంటర్నెట్‌ యూజర్లల్లో ప్రస్తుతం మహిళలు 47 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. ఇంటర్నెట్‌ వాడుతున్న మహిళల వాటా ఏకంగా 58 శాతంగా ఉంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×