BigTV English

Women’s World Cup Prize Money: 239 శాతం పెరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ప్రైజ్ మనీ… ఛాంపియన్ కు ఎన్ని కోట్ల అంటే

Women’s World Cup Prize Money: 239 శాతం పెరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ప్రైజ్ మనీ… ఛాంపియన్  కు ఎన్ని కోట్ల అంటే

Women’s World Cup Prize Money: మహిళా క్రికెట్ చరిత్రలో ఇదో సంచలనం. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ {​women’s ODI world cup} టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ {ICC} కీలక ప్రకటన చేసింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ప్రైస్ మనీ ని 2022లో న్యూజిలాండ్ లో జరిగిన టోర్నీకి కేటాయించిన అమౌంట్ కంటే 297% అధికంగా పెంచుతూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో 13.88 మిలియన్ డాలర్లు {అనగా.. భారత కరెన్సీలో సుమారు రూ. 122 కోట్లు} గా ఖరారు చేసింది.


Also Read: Sara Tendulkar: ఆ కుర్రాడితో సారా ఎ***ఫైర్.. రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది ?

శ్రీలంక – భారత్ కలిసి ఆతిథ్యం ఇవ్వనున్న 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ కోసం ప్రైజ్ మనీని పెంచుతూ ఐసీసీ చీఫ్ జై షా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మహిళల క్రికెట్ ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. దీంతో ఈసారి ఈ టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి జట్టుపై డబ్బుల వర్షం కురువబోతోంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు 4.48 మిలియన్ డాలర్లు {భారత కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లు} అందుకుంటుంది. ఇది 2023 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టు అందుకున్న దానికంటే 239% ఎక్కువ. 2023 సమయంలో ఆస్ట్రేలియా కేవలం 11 కోట్లు మాత్రమే బహుమతిగా అందుకుంది.


ఇక రన్నరప్ జట్టు 2.24 మిలియన్ డాలర్లు {రూ. 19 కోట్లు}, సెమీ ఫైనలిస్ట్ లు ఒక్కో జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు {రూ. 9 కోట్లు}, అలాగే గ్రూప్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైస్ మనీ ని కేటాయించింది. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్ కి 34, 314 డాలర్లు {రూ. 31 లక్షలు} అందనుంది. అలాగే ఐదు, ఆరు స్థానాలలో నిలిచిన జట్లకు 700,000 డాలర్లు {రూ. 6 కోట్లు}, 7, 8 స్థానాలలో నిలిచిన జట్లకు 280,000 డాలర్లు {రూ. 2.6 కోట్లు} అందనుంది. అంతేకాకుండా ఈ టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టుకు 2,50,000 డాలర్లు {రూ. 2 కోట్లు} ప్రైజ్ మనీ లభించబోతోంది. ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో ఓ చారిత్రాత్మక మైలురాయి అని ఐసిసి చైర్మన్ జై షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30న గౌహతి లోని ఏసీఏ స్టేడియంలో భారత్ – శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ తో ప్రారంభం అవుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగుతుంది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 పూర్తి షెడ్యూల్:

సెప్టెంబర్ 30 మంగళవారం: ఇండియా v శ్రీలంక – బెంగళూరు.

బుధవారం 1 అక్టోబర్: ఆస్ట్రేలియా v న్యూజిలాండ్ – ఇండోర్.

గురువారం 2 అక్టోబర్: బంగ్లాదేశ్ v పాకిస్తాన్ – కొలంబో.

శుక్రవారం 3 అక్టోబర్: ఇంగ్లాండ్ v దక్షిణాఫ్రికా – బెంగళూరు.

అక్టోబర్ 4 శనివారం: ఆస్ట్రేలియా v శ్రీలంక – కొలంబో.

అక్టోబర్ 5 ఆదివారం: ఇండియా v పాకిస్తాన్ – కొలంబో.

సోమవారం 6 అక్టోబర్: న్యూజిలాండ్ v దక్షిణాఫ్రికా – ఇండోర్.

మంగళవారం 7 అక్టోబర్: ఇంగ్లాండ్ v బంగ్లాదేశ్ – గౌహతి.

బుధవారం 8 అక్టోబర్: ఆస్ట్రేలియా v పాకిస్తాన్ – కొలంబో.

గురువారం 9 అక్టోబర్: ఇండియా v దక్షిణాఫ్రికా – వైజాగ్.

శుక్రవారం 10 అక్టోబర్: న్యూజిలాండ్ v బంగ్లాదేశ్ – వైజాగ్.

శనివారం 11 అక్టోబర్: ఇంగ్లాండ్ v శ్రీలంక – గౌహతి.

ఆదివారం 12 అక్టోబర్: ఇండియా v ఆస్ట్రేలియా – వైజాగ్.

సోమవారం 13 అక్టోబర్: దక్షిణాఫ్రికా v బంగ్లాదేశ్ – వైజాగ్.

మంగళవారం 14 అక్టోబర్: న్యూజిలాండ్ v శ్రీలంక – కొలంబో.

బుధవారం 15 అక్టోబర్: ఇంగ్లాండ్ v పాకిస్తాన్ – కొలంబో.

గురువారం 16 అక్టోబర్: ఆస్ట్రేలియా v బంగ్లాదేశ్ – వైజాగ్.

శుక్రవారం 17 అక్టోబర్: దక్షిణాఫ్రికా v శ్రీలంక – కొలంబో.

శనివారం 18 అక్టోబర్: న్యూజిలాండ్ v పాకిస్తాన్ – కొలంబో.

ఆదివారం 19 అక్టోబర్: ఇండియా v ఇంగ్లాండ్ – ఇండోర్.

సోమవారం 20 అక్టోబర్: శ్రీలంక v బంగ్లాదేశ్ – కొలంబో.

మంగళవారం 21 అక్టోబర్: దక్షిణాఫ్రికా v పాకిస్తాన్ – కొలంబో.

బుధవారం 22 అక్టోబర్: ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ – ఇండోర్.

గురువారం 23 అక్టోబర్: ఇండియా v న్యూజిలాండ్ – గౌహతి.

శుక్రవారం 24 అక్టోబర్: పాకిస్తాన్ v శ్రీలంక – కొలంబో.

అక్టోబర్ 25 శనివారం: ఆస్ట్రేలియా v శ్రీలంక – ఇండోర్.

ఆదివారం 26 అక్టోబర్: ఇంగ్లాండ్ v న్యూజిలాండ్ – గౌహతి.

ఆదివారం 26 అక్టోబర్: ఇండియా v బంగ్లాదేశ్ – బెంగళూరు.

బుధవారం 29 అక్టోబర్: సెమీ-ఫైనల్ 1 – గౌహతి/కొలంబో.

గురువారం 30 అక్టోబర్: సెమీ-ఫైనల్ 2 – బెంగళూరు.

ఆదివారం 2 నవంబర్: ఫైనల్ – కొలంబో/బెంగళూరు.

Related News

Sanju Samson : 30 సిక్స్ లతో రెచ్చిపోయిన సంజూ…నో లుక్ షాట్ వైరల్

Sara Tendulkar: ఆ కుర్రాడితో సారా ఎ***ఫైర్.. రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది ?

Sam Billings: ది హండ్రెడ్ లో హ్యాట్రిక్ టైటిల్స్… ధోని, రోహిత్ రికార్డులకు ఎసరుపెట్టిన సామ్ బిల్లింగ్స్

Rohit Sharma: 22 రోజుల్లో 20 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ…బ్రాంకో టెస్టు ఇక జుజుబీ

BCCI : రూ. 452 కోట్లకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్.. బీసీసీఐ అదిరిపోయే స్కెచ్?

Big Stories

×