Tasty Teja:టేస్టీ తేజ(Tasty Teja).. ఒకప్పుడు ఈ పేరు ఈయన ఫాలోవర్స్ కి,సన్నిహితులకు తప్ప ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు టేస్టీ తేజ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. అంత పాపులారిటీ రావడానికి బిగ్ బాస్ 7.. ఈ షో ద్వారా చాలామందికి టేస్టీ తేజ పరిచయమయ్యారు. అలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక తన ఆట తీరుతో.. తన కామెడీ జోకులతో ఎంతోమందిని నవ్వించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. టేస్టీ తేజ హౌస్ లో ఎక్కువగా కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టితో కలిసి తిరుగుతూ.. వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తోంది అని చూసేవారికి అనుమానాలు రేకెత్తించేలా ప్రవర్తించేవారు. కానీ ఫైనల్ గా మా ఇద్దరి మధ్య ఏం లేదు ఫ్రెండ్షిప్ తప్ప అని ఒప్పుకున్నారు.
బిగ్ బాస్ తర్వాత బిజినెస్ మొదలు పెట్టిన టేస్టీ తేజ..
అయితే అలాంటి టేస్టీ తేజ హౌస్ నుండి బయటకు వచ్చాక ఎన్నో బిజినెస్ లు స్టార్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా టేస్టీ తేజ బిగ్ బాస్ స్టేజ్ మీదే బయటపెట్టారు. బిగ్ బాస్ 7లో 9 వారాలు ఉండి ఎలిమినేట్ అయిన తేజ బిగ్ బాస్ 8 లో మళ్లీ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా వచ్చి 13 వారాలపాటు కొనసాగారు. ఆ సమయంలో తేజ తన బిజినెస్ గురించి చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక దాదాపు నేను 22 టీ బ్రాంచెస్ ఓపెన్ చేశానంటూ తన సక్సెస్ గురించి చెప్పుకొచ్చారు. ఇరానీ నవాబ్స్ టీ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తన బ్రాంచ్ ని విస్తరించినట్టు చెప్పుకొచ్చారు..
గణేష్ లడ్డూని సొంతం చేసుకున్న టేస్టీ తేజ.. ఖరీదు ఎంతంటే?
అయితే అలాంటి టేస్టీ తేజ తాజాగా గణపతి లడ్డును వేలంలో కొని వార్తల్లో నిలిచారు. విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది గణపతి చతుర్థి వేడుకలతో పాటు నిమర్జనం వేడుకలు కూడా అక్కడక్కడా జరుగుతున్నాయి. చాలామంది వినాయకుడు పెట్టిన ఒకరోజు తర్వాత నుండి నిమర్జనాలు చేస్తూ ఉంటారు. వినాయకుడు పెట్టిన ఒకరోజు తర్వాత లేదా మూడు రోజులకు, ఐదు రోజులకి, తొమ్మిది రోజులకి వినాయక నిమర్జనం జరుగుతుంది. అలా టేస్టీ తేజ ఉండే దగ్గర కూడా వినాయకుడి నిమర్జనం జరిగింది. అయితే వినాయకుడిని నిమర్జనం చేసే ముందే లడ్డు వేలం వెయ్యడం ఉంటుంది. ఈ లడ్డు వేలంలో పాల్గొన్న టేస్టీ తేజా ఏకంగా 2 లక్షల 16 వేల రూపాయల వరకు వేలం పాట పాడి గణేష్ లడ్డూని దక్కించుకున్నారు. అలా తాను కొన్న గణపతి లడ్డుని పట్టుకొని డప్పు చప్పుళ్ల మధ్య ఇంటికి బయలుదేరాడు.
తల్లి హారతితో ఆహ్వానం..
టేస్టీ తేజ ఇంటికి రావడంతోనే తన తల్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో టేస్టీ తేజ కి కంగ్రాట్స్ చెబుతున్నారు. డప్పు సౌండ్ కి టేస్టీ తేజ కూడా స్టెప్పులు వేశారు.. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు టేస్టీ తేజ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు. ఇదంతా బిగ్ బాస్ పుణ్యమే అని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ లోకి వచ్చాక ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోవడమే కాకుండా అందులో వచ్చిన డబ్బులతో బిజినెస్ కూడా పెట్టీ దానిని విస్తరించుకున్నాడు. అలాగే రకరకాల వంటలు టేస్ట్ చేస్తూ యూట్యూబ్లో ఎప్పుడు సందడి చేస్తూ ఉంటారు. దీనికి తోడు పెద్దపెద్ద స్టార్ హీరోలతో హీరోయిన్లతో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు..
also read:Ram Gopal Varma Tweet : పోలీసులకే భయం వేస్తే ఎక్కడికి వెళ్తారు… ఆర్జీవీ ట్వీట్ వైరల్