Kissik Talk Show : గీతా సింగ్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో కీలక పాత్రలలో నటించిన ఈమె హీరోయిన్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. గీతా సింగ్(Geetha Singh) అంటే అందరికీ టక్కున కితకితలు(Kitha Kithalu) సినిమానే గుర్తుకు వస్తుంది. అల్లరి నరేష్, గీత సింగ్ హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసిందే. ఇలా హీరోయిన్ గాను అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న గీత సింగ్ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big Tv Kissik Talks)కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన సినీ జర్నీ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.
కొడుకు మరణంతో ఒంటరిగా…
ఇకపోతే గీత సింగ్ ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె పెళ్లి చేసుకోకపోయినా ఒక అబ్బాయిని దత్తత తీసుకొని తన బాగోగులని చూసుకుంటూ వచ్చారు. అయితే అబ్బాయి 20 సంవత్సరాల వయసు తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇలా దత్తత తీసుకొని పెంచుకున్న కొడుకు కూడా మరణించడంతో ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా గీత సింగ్ పెళ్లి(Marriage) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎందుకని పెళ్లి చేసుకోలేదు అంటూ వర్ష(Varsha) ప్రశ్నించడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
ఎవరు లవ్ ప్రపోజ్ చేయలేదు..
ఈ సందర్భంగా గీతా సింగ్ మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకొనే వయసులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాను. ఇలా సినిమాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలోనే పెళ్లి చేసుకోలేకపోయానని ఇప్పుడు చేసుకుందామనుకున్న ఎవరు దొరకట్లేదు అంటూ సమాధానం చెప్పారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలోనే పెళ్లి ఆలోచనలు రాలేదంటూ తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న కూడా ఎదురవడంతో నన్ను చూసి లవ్ చేసే వాళ్ళు ఎవరుంటారు అంటూ సమాధానం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నేను బాయ్ కట్ తో షాట్స్ టీషర్ట్స్ వేసుకుని తిరిగేదాన్ని. ఎక్కడికి వెళ్ళిన అందరితో బాగా గొడవలు పడేదాన్ని నన్ను చూడగానే అందరూ పరుగులు పెట్టేవారు అలాంటిది నన్ను ఎవరు లవ్ చేస్తారు? ఎవరు ప్రపోజ్ చేస్తారు అంటూ ఈమె సమాధానం చెప్పారు.
తనకు చిన్నప్పటినుంచి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం స్కూల్ కి వెళ్తే క్లాసులో కంటే కూడా గ్రౌండ్లోనే ఎక్కువగా ఉండేదాన్ని, ఎక్కడ స్పోర్ట్స్ జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్లిపోయేదాన్ని కరాటే చాలా బాగా వచ్చు అంటూ గీత సింగ్ చేసిన ఈ కామెంట్స్ బయటలవుతున్నాయి. ఇక కెరియర్ గురించి కూడా మాట్లాడుతూ.. ప్రస్తుతం తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ కూడా పూర్తి అయ్యాయని, డిసెంబర్ లేదా జనవరిలో ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అంటూ తన కెరీర్ కి సంబంధించిన విషయాలు గురించి కూడా గీతా సింగ్ వెల్లడించారు.
Also Read: Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం బాలీవుడ్ ఎంట్రీ… ఏకంగా మీర్జాపూర్ డైరెక్టర్‌తో ?