Big Stories

Impact Player Rule backfired in IPL : ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఎదురుతన్నుతోంది.. కాస్త చూసుకోండి మేనేజ్‌మెంట్స

Impact Player Rule backfired in IPL

Impact Player Rule backfired in IPL : ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ సూపర్. కాని, ఒక్కోసారి చాలా దారుణంగా మిస్ ఫైర్ అవుతుంటుంది. అలా వచ్చిన వాళ్లే మ్యాచ్‌లను దూరం చేస్తున్నారు. అలాంటి మూడు ఉదాహరణలు.

- Advertisement -

రెహమాన్ అండ్ షా… ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్:
మొన్నటి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్లు ఢిల్లీని గట్టెక్కించలేకపోయారు. ముస్తాఫిజుర్ రెహమాన్‌ ఇంపాక్ట్ ప్లేయర్‌గా గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. మూడు ఓవర్లు వేసి ఏకంగా 41 పరుగులు ఇచ్చుకున్నాడు. అందుకే, నాలుగో ఓవర్ కూడా వేయనివ్వలేదు. ఇదే సమయంలో మిగతా ఢిల్లీ బౌలర్లు కాస్త బాగానే బౌలింగ్ చేశారు. ఇక పృథ్వీ షా. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అడుగు పెట్టి రన్ ఔట్ అయి జీరో పరుగులకే వెనుతిరిగాడు. సో, ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో బ్యాక్ ఫైర్ అయింది.

- Advertisement -

ఖలీల్ అహ్మద్ అండ్ పృథ్వీ షా… ఢిల్లీ వర్సెస్ రాజస్తాన్
రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ రెండు ఓవర్లు వేసి 31 పరుగులు సమర్పించుకున్నాడు. పైగా ఒక్క వికెట్ కూడా తీయలేదు. అదే మ్యాచ్‌లో పృథ్వీ షా మరోసారి డక్ ఔట్ అయ్యాడు. పాపం ఢిల్లీ క్యాపిటల్స్.

సుయాశ్ శర్మ అండ్ వెంకటేశ్ అయ్యర్.. కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్
ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాశ్ శర్మతో బౌలింగ్ చేయించింది కోల్‌కతా. కాని, నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండానే 44 పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ ఏకంగా 229 పరుగులు చేసింది. ఇక బాగా బ్యాటింగ్ చేస్తాడని తీసుకొచ్చుకున్న వెంకటేశ్ అయ్యర్.. 11 బాల్స్ ఆడి కేవలం 10 పరుగులకే వెనుదిరిగాడు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News