BigTV English

BCCI Latest Cricket News: టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు.. బీసీసీఐ భారీ నజరానా

BCCI Latest Cricket News: టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు.. బీసీసీఐ భారీ నజరానా

bcci latest news update


BCCI Likely To Increase Pay Of Test Players(Cricket news today telugu): ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమ్ ఇండియా ఘనంగా ముగించింది. 4-1 తేడాతో గెలిచింది. ఈ శుభ తరుణంలో బీసీసీఐ సెక్రటరీ జైషా అదిరిపోయే ప్రోత్సహకాలు టీమ్ ఇండియా జట్టుకి ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్ అంటే నిరాసక్తత చూపించే యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు వీటిని ఇస్తున్నట్టుగా చెప్పకనే చెప్పాడు.

ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ల వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకుని ఈ నజరానాలు ప్రకటించారని అంటున్నారు. ఇంతకీ ఆ నజరానాలు ఏమిటంటే..


ఒక ఏడాది కాలంలో ఒక ఆటగాడు సగం కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడితే ప్రతీ మ్యాచ్‌కు రూ. 30 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందుకోనున్నాడు. 75 శాతం కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడితే ప్రతీ మ్యాచ్‌కు రూ. 45 లక్షల చొప్పున అధిక వేతనాన్ని తీసుకోనున్నాడు. తుది జట్టులో ఆడని ఆటగాళ్లు 50 శాతం ఎక్కువ మ్యాచ్‌ల్లో జట్టుతో ఉంటే ఒక్కో టెస్ట్‌కు రూ. 15 లక్షలు లభిస్తుంది. అదే  75 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితమైతే రూ. 22.5 లక్షలు అందుకుంటారు.

Read more: పరుగుల్లో యశస్వి , వికెట్లలో అశ్విన్ టాప్

ఉదాహరణకి ఒక ఏడాదిలో 8 టెస్టు మ్యాచ్ లు జరిగితే సగం కంటే ఎక్కువంటే కనీసం 5 ఆడాల్సి ఉంటుంది. అప్పుడే పైన చెప్పిన రూ.30 లక్షలు వస్తుంది. ఇంకా ఎక్కువ ఆడితే రూ. 45 లక్షలు వస్తుంది. ప్రస్తుతం ఈ ఏడాది సౌతాఫ్రికాలో ఒకటి, ఇంగ్లాండుతో 5 మొత్తం ఆరు జరిగాయి. రానున్న 9 నెలల్లో ఎన్ని జరుగుతాయో తెలీదు.

అలా 10 టెస్టు మ్యాచ్ లు గానీ ఆడితే కనీసం ఆరు మ్యాచ్ లు ఆడినవారు ఈ ప్రోత్సహకాలను అందుకుంటారు. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న మ్యాచ్ ఫీజులకు అదనంగా క్యాష్ రివార్డ్స్ అందజేస్తామని, కనీస ప్రోత్సాహకంగా రూ. 15 లక్షలను నిర్ణయించామని ఆ ప్రకటనలో జై షా పేర్కొన్నాడు.

ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ని అభిమానించే అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.కాలక్రమంలో అందరికీ వర్తింపచేస్తారని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×