Virender Sehwag son: ఇండియాలో రోజుకు కొత్త ప్లేయర్ పుట్టుకు వస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీ చేయడం..లేదా వికెట్లపై వికెట్లు తీయడం… ఏదో ఒక మ్యాజిక్ చేసి తెరపైకి వస్తున్నారు. ఇటీవల 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లోకి వస్తాడు అన్న వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త గురించి జనాలు మర్చిపోకముందే…. మరో కుర్రాడు తెరపైకి వచ్చాడు.
ALSO READ: Jasprit Bumrah: రోహిత్ శర్మకు వద్దు… నాకే కెప్టెన్సీ ఇవ్వాలి.. బుమ్రా సంచలన వ్యాఖ్యలు!
ALSO READ: Dhanashree Verma: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాహల్ భార్య ధనశ్రీ.. ఆ హీరోతో సినిమా ?
ఈసారి సెహ్వాగ్ కొడుకు…డబుల్ సెంచరీ చేసి…రఫ్ ఆడించేసాడు. టీమిండియా.. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే ఆయన కొడుకు ఆర్య వీరు కూడా డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో తాజాగా మ్యాచ్ జరిగింది.
Also Read: Bhuvneshwar Kumar: ఐపీఎల్ వేలంకు ముందే LSG నుంచి భువనేశ్వర్ కు ఆఫర్ !
ఈ సందర్భంగా ఢిల్లీ తరఫున.. బరిలోకి దిగాడు ఆర్యవీర్ సెహ్వాగ్. ఈ సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 229 బంతుల్లోనే.. డబుల్ సెంచరీ చేయడం గమనార్హం. ఇందులో 34 ఫోర్లు అలాగే రెండు సిక్సర్లు బాదేశాడు. ఇక అటు మొదటి ఇన్నింగ్స్ లో మేఘాలయ 260 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇటు ఢిల్లీ 468 పరుగులు చేసింది.