IND vs AUS 2nd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ( BGT 2024)పైన అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. తొలి మ్యాచ్ లో టీమిండియా (Team India) విజయం సాధించడంతో రెండవ మ్యాచ్ పైన ప్రతి ఒక్కరి ఫోకస్ పడబోతోంది. తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ, గిల్ లేకపోయినప్పటికీ ఆ లోటు కనిపించకుండా భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే ఇప్పుడు గిల్, రోహిత్ జట్టులోకి వచ్చారు. దీంతో ఆడిలైడ్ ఓవర్ లో బరిలోకి దిగే తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా ఫైనల్ లెవెల్ లో మూడు మార్పులు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే ఒక ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతాడు. మరో ఓపెనర్ గా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడుతాడు.
యశస్వి జైస్వాల్ ఫామ్ టీమ్ ఇండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. రోహిత్ శర్మ ( Rohit harma) మాత్రం బిగ్ ఇన్నింగ్స్ ను బాకీ ఉన్నాడు. గత మ్యాచ్ లో ఓపెనర్ గా రాహుల్ ఆడాడు. రాహుల్ ఇప్పుడు తన స్థానాన్ని త్యాగం చేయక తప్పదు. మిడిలార్డర్ లోకి కేఎల్ రాహుల్ పోవాల్సి వస్తోంది. వన్ డౌన్ లోను రాహుల్ ఆడడానికి అవకాశాలు లేవు. మూడవ స్థానంలో గిల్ ఆడనున్నాడు. ఒకప్పుడు ఓపెనర్ గానే గిల్ బరిలోకి దిగాడు. కానీ యశస్వి జైస్వాల్ ఎంట్రీ తర్వాత వన్ డౌన్ లోకి మారిపోయాడు. మూడవ స్థానంలోనే సెటిల్ అయ్యాడు. పెర్త్ లో గిల్ ఆడక పోవడంతో దేవదత్ పడిక్కల్ అవకాశాన్ని అందుకున్నాడు.
Also Read: Ashish Nehra to jasprit bumrah: ఆ టీమిండియా ప్లేయర్ వేలంలోకి వస్తే రూ.520 కోట్లు..?
ఇప్పుడు గిల్ ఎంట్రీతో పడిక్కల్ బెంచ్ కు పరిమితం కావాల్సిందే. నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. కింగ్ రెగ్యులర్ పోసిషన్ నాలుగవ స్థానమే. గ్యాప్ తర్వాత పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. అదే జోరును కొనసాగిస్తే ఆడిలైడ్ ఓవర్ లోను టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆడిలైడ్ లో పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. దీంతో కోహ్లీ అనుభవం టీమిండియాకు కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఐదవ స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగుతాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడే పంత్ తో ఆస్ట్రేలియాకు టెన్షన్ తప్పదు.
ఆరవ స్థానంలో బ్యాటింగ్ భారాన్ని కేఎల్ రాహుల్ మోయనున్నాడు. రాహుల్ కోసం జట్టు నుంచి ధ్రువ్ జురెల్ తప్పుకోవాల్సి వస్తుంది. పెర్త్ టెస్ట్ లో ఆడిన వాషింగ్టన్ సుందర్ కు రెండవ మ్యాచ్ లో అవకాశం దొరకకపోవచ్చు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పేస్ ఆల్ రౌండర్ గా నితీష్ కుమార్ పైన అంచనాలు ఉండబోతున్నాయి.
గతంలో మ్యాచ్ లో నితీష్ కుమార్ ఆకట్టుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే ఆల్ రౌండ్ స్కిల్స్ ను చూపించాడు. హర్షిత్ రానా కూడా పెర్త్ లో మెరిశాడు. జస్ప్రిత్ బుమ్రా ఫామ్ కలిసి రానుంది. మహమ్మద్ సిరాజ్ కూడా మంచి ఊపు మీద ఉన్నాడు. మొత్తంగా టీమ్ ఇండియా ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఆతిథ్య జట్టు పైన ఒత్తిడి పెరిగేలా చేస్తోంది. గత పరాజయం నుంచి బయటపడడం ఆస్ట్రేలియాకు అంత ఈజీ ఏమీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.