Sanjiv Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ( 2025 Indian Premier League ) స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant ) రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka )…. స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) వేలంలో కొనుగోలు చేశాడు. కేఎల్ రాహుల్ ఢిల్లీకి వెళ్లిపోగా… పంత్ లక్నోతో జతకట్టాడు. అయితే పంత్ కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు పంత్ కు అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా అని అందరూ ఆలోచనలో పడ్డారు.
Also Read: WPL Auction 2025: జాక్‌పాట్ కొట్టిన 16 ఏళ్ల అమ్మాయి…రికార్డు సృష్టించిన విండీస్ ప్లేయర్!!
తాజాగా సంజీవ్ గొయెంకా ( Sanjiv Goenka )ఈ విషయం పై న అసలు నిజాన్ని వెల్లడించాడు. రిషబ్ పంత్ ను రూ. 27 కోట్లకు వేలం వేయడానికి ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ అని గొయెంకా వెల్లడించాడు. అతనికి పంత్ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే పంత్ ను రూ. 27 కోట్లకు వేలం వేసామని చెప్పాడు. నిజానికి వేలం సమయంలో పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మరియు లక్నో మధ్య గట్టి పోటీ ఏర్పడింది. చివరిలో పంజాబ్ తప్పుకోగా ఢిల్లీ, లక్నో పోటి పడ్డాయి. పంత్ ను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ 20.25 కోట్లకు బిట్ వేసింది.
గత సీజన్లో అదే జట్టులో ఉన్నందున ఢిల్లీకి ఆర్టీఎం ఉపయోగించే అవకాశం కూడా ఉంది. కానీ ఎల్ఎస్జి ఏకంగా 27 కోట్లకు బిట్ వేసింది. దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వెనకడుగు వేయడంతో పంత్ లక్నోలో చేరాడు. స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో అవకాశాలను దక్కించుకున్నాడు. పైగా పంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో సంజీవ్ ఇంకా తమ జట్టులోకి స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) ను తీసుకున్నట్లుగా వెల్లడించాడు.
Also Read: Travis Head: టీమిండియాకు శనిలా మారిన ట్రావిస్ హెడ్…ఆ ఇద్దరి సెంచరీ పూర్తి !
త్వరలోనే స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) ను లక్నో కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. లక్నో సూపర్ జేయింట్స్ లో ఐడెన్ మార్క్రమ్, మిచెల్, నికోలస్ పూరన్ రూపంలో మరో ముగ్గురు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అయితే ముగ్గురు విదేశీ ఆటగాళ్లు కావడంతో పంత్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) మరో పదేళ్ల పాటు క్రికెట్ అద్భుతంగా ఆడగలడు. దీంతో పంత్ ను కెప్టెన్ చేస్తే తమ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించగలరని లక్నో భావిస్తోంది.