BigTV English

IND vs Aus 3rd Test: మూడో టెస్ట్ కు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరం.. టీమిండియా ఫైనల్ స్క్వాడ్ ఇదే!

IND vs Aus 3rd Test: మూడో టెస్ట్ కు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరం.. టీమిండియా ఫైనల్ స్క్వాడ్ ఇదే!

IND vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీలో భాగంగా… ఐదు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఇప్పటికే టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండు టెస్టులు పూర్తయ్యాయి. ఇందులో టీమిండియా మొట్టమొదటి టెస్టు విజయం సాధించగా రెండో టెస్టుల్లో మాత్రం చతికల పడింది. ఈ తరుణంలోనే రెండవ టెస్టులో టీమిండియాను చిత్తు చేసింది ఆస్ట్రేలియా.


Also Read: Mohammad Shami: మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ మధ్య చిచ్చు పెడుతున్న పాకిస్తాన్?

దీంతో ఈ ఐదు టెస్టుల సిరీస్ చెరొక విజయంతో సమంగా మారింది. మరో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ మూడు టెస్ట్ లో టీమిండియా విజయం సాధిస్తేనే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ బరిలో ఉంటుంది. లేకపోతే ఇంటి దారి పట్టక తప్పదు. కాబట్టి కచ్చితంగా మూడు టెస్టులు టీమిండియా గెలవాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.


ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్ మ్యాచ్ కు… టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ఇద్దరూ దూరం కాబోతున్నారట. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ బూమ్రా , హర్షిత్ రానా… ఇద్దరు జట్టు నుంచి వెళ్లిపోనున్నట్లు సమాచారం అందుతోంది. గాయం కారణంగా టీమిండియా వైస్ కెప్టెన్ బుమ్రా దూరం అవుతాడని చెబుతున్నారు. అయితే… హర్షిత్ రానా మాత్రం… తన ఆడ తీరు కారణంగా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Gautam Gambhir: టీమిండియా ఓటమికి కుట్రలు..గంభీర్‌ పై ట్రోలింగ్‌ ?

మొదటి టెస్టులో… పర్వాలేదనిపించిన హర్షిత్ రానా… రెండవ టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో… తేలిపోయాడు ఈ కేకేఆర్ బౌలర్. దీంతో గౌతమ్ గంభీర్ ను ట్రోలింగ్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కారణంగానే అతను జట్టులోకి వచ్చారని… కోచ్ పరువు తీస్తున్నారు. అయితే బూమ్రాతోపాటు హర్షిత్ రానా బయటకు వెళ్తే… మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్ జట్టులోకి వస్తారని చెబుతున్నారు.

అయితే అటు మహమ్మద్ షమీ.. ఫిట్నెస్ పైన అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ 14వ తేదీ లోపు… ఫిట్నెస్ గా ఉంటేనే మహమ్మద్ షమీ ఆడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మరొకరికి అవకాశం ఉంటుంది. దీంతో టీమిండియా కు కొత్త కష్టాలు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియా లాంటి పిచ్ లపై … ఫాస్ట్ బౌలర్లే అవసరం ఉంటుంది. కాబట్టి టీమిండియా ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది.

ఇక తుది జట్టులో… రెండవ టెస్టు ఆడిన ప్లేయర్లని ఆడించే ఛాన్స్ ఉంది. అటు రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఈసారి ఆరవ వికెట్ కు ఎక్కే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే యశస్వి జైస్వాల్ తో పాటు కే ఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×