BigTV English

Rohit Sharma – Akash Deep: నీకు బుర్ర ఉందా..? రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్

Rohit Sharma – Akash Deep: నీకు బుర్ర ఉందా..? రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్

Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బెన్ లోని గబ్బా వేదికగా మూడవ టెస్ట్ శనివారం ఉదయం నుండి జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన టీమిండియా.. 51 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అడిలైడ్ తర్వాత గబ్బా లోనూ భారత్ ఓడిపోతే డబ్ల్యూటీసి ఫైనల్ 2025 ఆడాలనే ఆశలకు భారీ దెబ్బ తగులుతుంది.


Also Read: IND vs AUS: మళ్లీ అదే తప్పు.. నీకు బ్యాటింగ్‌ చేతకాదంటూ కోహ్లీపై గవాస్కర్‌ సీరియస్

అంతేకాదు ఈ మ్యాచ్ లో ఓడిపోతే 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో భారత్ 3 వ స్థానంలో నిలిచినా పాయింట్లు తగ్గుతాయి. ఈ మ్యాచ్ లో భారీ టార్గెట్ చేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకి ఆదిలోనే వరుస దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ కేవలం ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన విరాట్ కోహ్లీ కూడా కేవలం 3 పరుగులకే ఔట్ అయ్యాడు.


దీంతో కేవలం 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇక రిషబ్ పంత్ బ్యాటింగ్ కి దిగగానే వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం తగ్గి లంచ్ సెషన్ తర్వాత కేఎల్ రాహుల్ – రిషబ్ పంత్ వికెట్ పడకుండా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ పాట్ కమీన్స్ బౌలింగ్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన రిషబ్ పంత్ పెవిలియన్ బాట పట్టాడు. ఇక మూడవరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 33, రోహిత్ శర్మ 0 {Rohit Sharma}  పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

ఈ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పై భారత్ పై చేయి సాధించాలంటే ఇంకా 394 పరుగులు చేయాల్సి ఉంది. రోహిత్ – రాహుల్ వికెట్ పడకుండా ఆడితే టీమిండియా ఓటమి నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ {Rohit Sharma} ఎప్పుడు కూల్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అందరితో క్లోజ్ గా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా జట్టులోని అందరితో కలిసిపోతాడు.

Also Read: Bumrah: బుమ్రాకు ఘోర అవమానం.. కోతి జాతి అంటూ మహిళా కామెంటేటర్‌ కామెంట్స్‌!

ఇక కెప్టెన్ కాబట్టి అందరితో చనువుగా ఉండక తప్పదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చిల్ గా ఉండే రోహిత్ శర్మ.. తాజాగా ఓ యంగ్ ప్లేయర్ పై సీరియస్ అయ్యాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్సి కేరి బ్యాటింగ్ చేస్తుండగా.. 114వ ఓవర్ ని ఆకాష్ దీప్ వేశాడు. అయితే బంతిని వికెట్లకు దూరంగా విసరడంతో కీపర్ రిషబ్ పంత్ డ్రైవ్ చేసి బంతిని అందుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ {Rohit Sharma} ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఆకాష్ దీప్ వైపు సీరియస్ గా చూస్తూ.. ” నీ బుర్రలో ఏమైనా ఉందా..? ” అని అన్నాడు. దీంతో ఇవన్నీ స్టంపు మైక్స్ లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోని స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×