Big Stories

IND vs AUS 4th T20 : మ్యాక్స్ వెల్ లేడహో.. భారత్ అభిమానులకు శుభవార్త

IND vs AUS 4th T20

IND vs AUS 4th T20 : ఆసిస్ తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ నేపథ్యంలో నాలుగో టీ 20 నాగపూర్ లో జరగనుంది. అయితే మూడో టీ 20లో మ్యాక్స్ వెల్ వచ్చి చివరి వరకు ఉండి, సెంచరీ చేసి ఇండియా నుంచి మ్యాచ్ ని దూరం చేశాడు.

- Advertisement -

సిరీస్ నెగ్గే క్రమంలో మ్యాక్స్ వెల్ విధ్వంసంతో భారత్ కల చెదిరింది. ఇప్పుడు అభిమానులకి శుభవార్త ఏమిటంటే మ్యాక్స్ వెల్ తో పాటు మరో ముగ్గురు మార్కస్ స్టొయినిస్, జోస్ ఇంగ్లిస్,
సీన్ అబాట్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఇంతకుముందే ఆడమ్ జంపా, సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వెళ్లిపోయారు.

- Advertisement -

ఇంకా ముందు అంటే వరల్డ్ కప్ కొట్టిన తర్వాత కెప్టెన్ కమిన్స్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్ష్ ఇలాంటి వారు కొందరు వెళ్లిపోయారు. ఇప్పుడు  వీరు వెళ్లిపోయారు. ఇక ఆస్ట్రేలియా కూడా టీమ్ ఇండియా తరహాలోనే కొత్త వారికి అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఆడిన ట్రావెస్ హెడ్ ఒకరు మాత్రమే జట్టుతో ఉన్నాడు.

మాక్స్ వెల్ లేకపోవడం భారత అభిమానులకు శుభవార్త అయితే అయి ఉండవచ్చుగానీ, సీనియర్లు ఎవరూ లేకుండా ఆడితే ఏం మజా ఉంటుందని కొందరంటున్నారు. ఒకవేళ అలా సిరీస్ గెలిచినా సరే, అది పెద్ద కిక్ ఇవ్వదని అంటున్నారు. కొడితే గట్టోళ్ల మీద కొట్టి నెగ్గితేనే ఆ స్పిరిట్ ఉంటుంది, మన కుర్రాళ్ల స్టామినా ఏమిటనేది తెలుస్తుందని అంటున్నారు.

ఈసారి టీ 20లో కుర్రాళ్లు మాత్రం దుమ్ము దులుపుతున్నారు. చూస్తుంటే అందరికీ భారత క్రికెట్ లో మంచి భవిష్యత్ ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

కొత్తగా ఆసిస్ జట్టులోకి వస్తున్నవారు ఎవరంటే… బెన్ డార్వ్షుయిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, బెన్ మెక్డొర్మేట్, కేన్ రిచర్డ్సన్, జోష్ ఫిలిప్ ఉన్నారు.

మరి ఆసిస్ ని చూస్తే కొత్త రక్తం, యువరక్తంతో నిండి ఉంది. అదీకాకుండా టీ 20 మ్యాచ్ లు ఒకటి, రాబోయే నాగపూర్ మ్యాచ్ లో ధనాధన్ సిక్సులు తప్పేలా లేవు. మూడు మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా కుర్రాళ్లు స్కోరుని 200 దాటించారు. ఇందులో కూడా ఆ వాడి, వేడి చూపిస్తారా? లేక ఓడి, పీకలమీదకు తెచ్చుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News