IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ.. జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా ఓపెనర్ గిల్.. సూపర్ సెంచరీ చేయడంతో… రోహిత్ సేన విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు పైన ఏకంగా ఆరు వికెట్ల తేడాతో.. విజయం సాధించింది టీమిండియా. 229 పరుగుల లక్ష్యాన్ని.. కేవలం 46.3 ఓవర్ల లోనే నాలుగు వికెట్లు కోల్పోయి… చేదించింది టీమిండియా. టీం ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు.. అలాగే మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు రాణించడంతో.. అవలీలగా టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో.. ఈ దెబ్బకు…బోణి కొట్టింది టీం ఇండియా.
Also Read: Champions Trophy 2025: టీమ్ ఇండియాతో మ్యాచ్.. పాకిస్తాన్ కి బిగ్ షాక్
ఇక మ్యాచ్ వివరాలు లోకి వెళితే… టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు… మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 49.4 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్… ఏకంగా 228 పరుగులు చేసింది. అయితే… తో టాప్ ఆర్డర్ అలాగే టేలెండర్లు విఫలము కావడంతో… 228 పరుగులకే కుప్పకూలింది బంగ్లాదేశ్. కానీ.. బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు తౌహీద్ ఒక్కడు అద్భుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 118 బంతుల్లోనే సెంచరీ చేసుకున్న ఇతను… జట్టును ఆదుకున్నాడు.
84 స్ట్రైక్ రేట్ తో ఆరు బౌండరీలు బాదిన తౌహీద్ రెండు సిక్సర్లు కూడా బాదాడు. ఓపెనర్ హసన్ ఒక్కడు 25 పరుగులు చేసి రాణించాడు. ఇందులో నాలుగు బౌండర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్, బంగ్లాదేశ్ టీం కెప్టెన్ శాంటో ఇద్దరు కూడా డకౌట్ అయ్యారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను మహమ్మద్ షమీ అలాగే హర్షిత్ రానా తీయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన హసన్ మిరాజ్ కూడా దారుణంగా విఫలమై షమీకి వికెట్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్ లో హాసన్ మిరాజ్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. అద్భుతంగా రాణిస్తాడనుకున్న ముస్తఫిర్ రహీం కూడా డకౌట్ అయ్యాడు. ఇక టేలండర్లు… అత్యంత దారుణంగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో… అందరూ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఐసీసీ టోర్నమెంట్ అంటే రెచ్చిపోతున్న మహమ్మద్ షమీ… ఇవాల్టి మ్యాచ్లో 53 పరుగులు ఇచ్చే ఐదు వికెట్లు పడగొట్టాడు.
హర్షిత్ రానా కూడా 7 ఓవర్లకు పైగా వేసి 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం జరిగింది. దీంతో… టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు హర్షిత్ రానా. గంభీర్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ రాణిస్తున్నాడు. ఇక అనంతరం చేజింగ్కు దిగిన టీమిండియా 46.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ తర్వాత గిల్… 129 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో తొమ్మిది బౌండరీలు రెండు సిక్సర్లు ఉన్నాయి.
Also Read: Rohit Sharma: క్యాచ్ మిస్.. దండం పెడుతూ క్షమాపణలు చెప్పిన రోహిత్!
విరాట్ కోహ్లీ 22 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 15 పరుగులతో.. సరిపెట్టుకున్నాడు. కానీ ఇవాళ టీమిడియా వికెట్ కీపర్ కె ఎల్ రాహుల్.. 41 పరుగులతో దుమ్ము లేపాడు. మ్యాచ్ ను చివరి వరకు తీసుకువెళ్లాడు. దింతో చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో.. టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఫిబ్రవరి 23 అంటే ఆదివారం రోజున పాకిస్తాన్ తో తలపడుతుంది టీమిండియా.
Shubman Gill shines bright in Dubai 🌟
With a stunning unbeaten 101, he leads India to victory over Bangladesh 💪🏻🏏#ShubmanGill #BANvIND #ODIs #CT2025 #Indiancricket #Insidesport #CricketTwitter pic.twitter.com/Nar9lMC9Ut
— InsideSport (@InsideSportIND) February 20, 2025