Chhaava: హిస్టరీకి సంబంధించిన సినిమాలు ఏవి విడుదలయినా కూడా చాలావరకు ప్రేక్షకులు వాటికి అంత ఆదరణ చూపించారు. అలాంటి సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా అలా విడుదలయిన ఒక మూవీ ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ అందుకుంటూ దూసుకుపోతోంది. అదే ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీకి నార్త్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ మూవీని ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి కష్టపడుతున్నాయి. తాజాగా గోవా ముఖ్యమంత్రి ఈ సినిమా విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
గోవాలో కూడా
ఛత్రపతి సాంబాజీ మహారాజ్ బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రమే ‘ఛావా’. సాంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేశాడని, సినిమాకు అంత మంచి టాక్ రావడానికి తనే ముఖ్య కారణం అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ మూవీని ట్యాక్స్ ఫ్రీ చేశారు. మామూలుగా ఏదైనా సినిమా చూడాలంటే ఆ మూవీ టికెట్ ప్రైజ్‌పై ప్రభుత్వం ఎంతో కొంత ట్యాక్స్ నిర్ణయిస్తుంది. కానీ ‘ఛావా’ విషయంలో ఆ ట్యాక్స్ ఏదీ ఉండదంటూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అదే స్ట్రాటజీని గోవా కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తాజాగా బయటికి రావడంతో ‘ఛావా’ మేకర్స్ గర్వంగా ఫీలవుతున్నారు.
రెండు రాష్ట్రాల్లో
బుధవారం రోజున ‘ఛావా’ (Chhaava) సినిమా తమ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ అవుతుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు. ఛత్రపతి సాంబాజీ మహారాజ్ చేసిన సాహసాలు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఆయన మొఘలులకు ధీటుగా పోరాటం చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇక మహారాష్ట్ర, గోవాలాగానే మధ్యప్రదేశ్‌లో కూడా ఈ మూవీ ట్యాక్స్ ఫ్రీ కానుందని ఆ రాష్ట్రపు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా ఆయన ఈ నిర్ణయాన్ని బయటపెట్టారు. జబల్‌పూర్‌లో జరిగిన ఒక సభలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
Also Read: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ సీరిస్ ఆగిపోయిందా? రాజ్-డీకే ఊహించని రిప్లై!
ఆయన చొరవే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ‘ఛావా’కు సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొని సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా ఈ సినిమాను ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ చేయమని మేకర్సే ఆయనను కోరారు. దీంతో ఆయన దానికి తగిన పరిణామాలు తీసుకున్నారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ‘ఛావా’ను మాడోక్ ఫిల్మ్స్ సంస్థ యజమాని దినేష్ విజన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో విక్కీ కౌశల్‌కు జోడీగా రష్మిక మందనా (Rashmika Mandanna) నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరీ 14న విడుదలయిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తో అప్పుడే రూ.200 కోట్ల వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఇందులో విలన్‌గా నటంచిన అక్షయ్ ఖన్నాకు మంచి మార్కులు పడుతున్నాయి.