BigTV English

Ind vs Eng 3rd ODI: బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..షమీతో పాటు మరో ఇద్దరు ఔట్

Ind vs Eng 3rd ODI: బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..షమీతో పాటు మరో ఇద్దరు ఔట్

Ind vs Eng 3rd ODI: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య… ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే t20 సిరీస్ గెలిచిన టీమిండియా… వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. వరుసగా రెండు వన్డేలు గెలిచిన రోహిత్ శర్మ సేన… చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు… ఇంగ్లాండ్ పై సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ ఇరుజట్ల మధ్య ఇవాళ మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో… మూడవ వన్డే మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్న… ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడవ వన్డేలో… కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది.


ALSO READ: Matthew Kuhnemann: బౌలింగ్ యాక్షన్ లో అనుమానాలు.. ఆస్ట్రేలియన్ బౌలర్ మాథ్యూపై నిషేధం !

అయితే ఇందులో… టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయబోతుంది. ఈ మేరకు ఇంగ్లాండు కెప్టెన్ జోస్ బట్లర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రెండు వన్డేలో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్… చివరి వన్డేలో కూడా టాస్ నెగ్గి… చివరికి బౌలింగ్.. తీసుకోవడం జరిగింది. ఎలాగైనా చివరి వన్డే మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ చూస్తోంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది రోహిత్ శర్మ సేన. అయితే చివరి వన్డే మ్యాచ్ లో యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇందులో భాగంగానే ఏకంగా ముగ్గురిని… రెస్ట్ మూడ్లోకి పంపాడు.


మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ఇలా ముగ్గురు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ మరో ముగ్గురిని తీసుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లు అలాగే ఒక ఫాస్ట్ బౌలర్ ను రంగంలోకి దింపాడు రోహిత్ శర్మ. మొదటి రెండు వన్డేలు ఆడని అర్షదీప్ సింగ్… మూడవ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ తో పాటు కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇక మిగతా ప్లేయర్లు యధావిధిగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కు అవకాశం ఇవ్వబోరని ప్రచారం జరిగింది. కానీ చివరికి అతనికి అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మ. రిషబ్ పంత్ ను అలాగే డగౌట్ లో ఉంచారు. కాగా ఇప్ప్పటికే 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది టీమిండియా.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బిగ్ స్కెచ్.. 5 గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా..!

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్(w), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×