BigTV English

Matthew Kuhnemann: బౌలింగ్ యాక్షన్ లో అనుమానాలు.. ఆస్ట్రేలియన్ బౌలర్ మాథ్యూపై నిషేధం !

Matthew Kuhnemann: బౌలింగ్ యాక్షన్ లో అనుమానాలు.. ఆస్ట్రేలియన్ బౌలర్ మాథ్యూపై నిషేధం !

Matthew Kuhnemann: తాజాగా ఆస్ట్రేలియా – శ్రీలంక మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ని 14 ఏళ్ల విరామం తర్వాత 2 -0 తో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల ఈ సిరీస్ ని ఆస్ట్రేలియా జట్టు క్లిన్ స్వీప్ చేసింది. రెండవ టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {డబ్ల్యూటీసి} లీగ్ దశను ఆస్ట్రేలియా రెండవ స్థానంతో ముగించింది.


Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బిగ్ స్కెచ్.. 5 గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా..!

ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు.. తన చివరి సిరీస్ లో శ్రీలంకను 2 -0 తో చిత్తు చేసినప్పటికీ అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను దాటలేకపోయింది. అయితే గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టు తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ మ్యాథ్యూ కుహ్నేమాన్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు వచ్చాయి. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రెండు టెస్ట్ మ్యాచ్ లలో 16 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 2 -0 తో గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు.


అయితే మ్యాథ్యూ బౌలింగ్ చర్య పై ఫిర్యాదులు రావడంతో.. ఇప్పుడు అతడు తన బౌలింగ్ చర్యపై మూడు వారాలలోగా తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. ఒక బయోమెకానికిస్ట్ ఈ స్పిన్నర్ చర్యను విశ్లేషించి.. అతడు కనుగొన్న విషయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ {ఐసీసీ}కి నివేదిక సమర్పిస్తాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక బౌలర్ తన బౌలింగ్ ఆర్మ్ గరిష్టంగా 15 డిగ్రీల ఫ్లెక్స్ ని కలిగి ఉండాలి.

అయితే ఇప్పుడు అతని బౌలింగ్ యాక్షన్ పై నివేదిక వచ్చేవరకు అతడు అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయలేడు. మ్యాథ్యూ 2017 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి 124 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఐదు టేస్టు మ్యాచ్ లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచులు ఉన్నాయి. 2018 నుండి అతడు 55 బిగ్ బాష్ లీగ్ గేములు ఆడాడు. ఈ 8 ఏళ్ల అతడి క్రికెట్ కెరీర్ లో అతడి బౌలింగ్ చర్యను ప్రశ్నించడం ఇదే మొదటిసారి.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్ టీంలో ఫిక్సింగ్ కలకలం.. ఆ క్రికెటర్‌పై 5 ఏళ్ళు నిషేధం

మాథ్యూ కుహ్నేమాన్ 2023లో భారత్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు అతని బౌలింగ్ యాక్షన్ ని స్వతంత్ర నిపుణులు క్లియర్ చేసే వరకూ అతడు బౌలింగ్ చేయడానికి వీలు లేదు. ఇక టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం ప్రస్తుతం శ్రీలంక – ఆస్ట్రేలియా జట్లు వన్డే సిరీస్ ని మొదలుపెట్టాయి. ఈ రెండు వన్డేల సిరీస్ నేటి నుండి ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ రెండు వన్డేలు ఇరుజట్లకు కీలకం కానున్నాయి. ఇక తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 33 ఓవర్ల వద్ద 135 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది శ్రీలంక జట్టు. కెప్టెన్ చరిత్ అసలంక హఫ్ సెంచరీ తో రాణించాడు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×