IND vs ENG 3rd Test : లార్డ్స్ చారిత్రాత్మకమైన మైదానంలో భారత జట్టు ఓటమిని చవి చూసింది. ముఖ్యంగా నాలుగో రోజు చివరి గంట వరకు కూడా భారత్ దే విజయం ఖాయం అనేలా కనిపించింది. కానీ ఐదో రోజు ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్ట్ ను గెలుచుకుంది. వాస్తవానికి చివరి వరకు కూడా మ్యాచ్ ఉత్కంఠగానే కొనసాగింది. సిరాజ్ ఆపిన బంతి వెల్లి వికెట్లను తాకడంతో అతను వెనుదిరిగాడు. లేకుంటే టీమిండియా విజయం సాధించేదే. తక్కువ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ జట్టు దానిని కాపాడుకుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది ఇంగ్లాండ్. మూడో టెస్టులో టీమిండియా ఓడిపోవడానికి కారణం ఆ ప్లేయర్ అనే స్పష్టంగా అర్థమవుతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అదే మాట చెప్పడం విశేషం.
Also Read : WTC Points Table : లార్డ్స్ లో ఓటమి.. దిగజారిన టీమ్ ఇండియా స్థానం.. WTC పాయింట్ల పట్టిక ఇదే
అతను క్యాచ్ లు వదిలేయడంతోనే..
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్. చాలా అద్భుతంగా కీపింగ్ చేస్తాడు. అలాగే బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. కానీ అతను మూడో టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో చేతి వేలికి గాయమైంది. దీంతో రిషబ్ పంత్ బదులు సబ్ స్టిట్యూట్ గా ధృవ్ జురెల్ కీపర్ గా వచ్చాడు. అయితే జురెల్ కీపింగ్ చేస్తూ క్యాచ్ లు వదిలేశాడు. రిషబ్ పంత్ కూడా గాయపడకుండా అలాగే ఆడితే అటు బ్యాటింగ్.. ఇటు కీపింగ్ రెండింటిలో కూడా రాణించేవాడు. ధృవ్ జురెల్ కారణంగా ఇంగ్లాండ్ కి 22 పరుగులు వచ్చాయి. టీమిండియా కూడా 22 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. అంటే రిషబ్ పంత్ ఉంటే ఇలాంటి పొరపాట్లు జరుగకుండా మ్యాచ్ భారత్ విజయం సాధించేదని స్పష్టంగా చెప్పవచ్చు.
రిషబ్ పంత్ పై స్టోక్స్ ప్రశంసలు..
మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా రిషబ్ పంత్ పై ప్రశంసలు కురిపించాడు. రిషబ్ పంత్ జట్టులో ఉంటే మేము గెలిచే వాళ్లం కాదని.. అతను ప్రతిభవంతమైన ఆటగాడని.. అతని ఆటతీరు ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపారు. రిషబ్ పంత్ చాలా డేంజరస్ ప్లేయర్ అని.. అలాంటి ఆటగాడు మా జట్టులో ఉంటే బాగుండు అని స్టోక్స్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ తొలి టెస్టులో రెండు సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ, రెండో ఇన్నింగ్స్ ఇంకో సెంచరీ చేసాడు. రెండో టెస్టులో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మూడు టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా గాయంతో ఉండి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 74 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువలో ఉన్నాడు. రిషబ్ పంత్ ఎప్పుడైతే ఔట్ అయ్యాడో వెను వెంటనే టీమిండియా ఆటగాళ్లు అంతా క్యూ కట్టారు. రిషబ్ పంత్ రనౌట్ కాకుంటే టీమిండియా 400 పైగా స్కోర్ చేసింది. రిషబ్ పంత్ ఔట్ కావడమే టీమిండియాకి మైనస్ అని పలువురు క్రీడాభిమానులు పేర్కొనడం విశేషం.
Byes proving costly for India! 🙆♂️
22 runs given away through 6 four-byes from Dhurv jurel and
india lost by 22 Run. pic.twitter.com/guzkB6QVjR— muffatball vikrant (@Vikrant_1589) July 14, 2025