BigTV English

WTC Points Table : లార్డ్స్ లో ఓటమి.. దిగజారిన టీమ్ ఇండియా స్థానం.. WTC పాయింట్ల పట్టిక ఇదే

WTC Points Table : లార్డ్స్ లో ఓటమి.. దిగజారిన టీమ్ ఇండియా స్థానం.. WTC పాయింట్ల పట్టిక ఇదే

WTC Points Table :  టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తలపడుతుంది. ఇందులో తొలి టెస్టు ఇంగ్లాండ్ విజయం సాధించగా.. రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా జట్టు 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిపోయింది. ఓవైపు ఆల్ రౌండర్ జడేజా జట్టు విజయం వైపు పోరాడినప్పటికీ మిగతా బ్యాటర్లు అంతా ఒకరి వెనుక ఒకరూ క్యూ కట్టారు. దీంతో టీమిండియా కి ఓటమి తప్పలేదు. తొలుత కేఎల్ రాహుల్ పోరాడాడు. ఆ తరువాత జడేజా కూడా పోరాడాడు. కానీ ఆశించిన మేర మిగతా ఆటగాళ్ల సపోర్టు లేకపోవడంతో టీమిండియా పోరాడి.. 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే సిరాజ్ కూడా వికెట్ పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దురదృష్టవశాత్తు సిరాజ్ బంతిని ఆపినప్పటికీ.. ఆ బంతి దొర్లుకుంటూ పోయి వికెట్లకు తాకింది. దీంతో సిరాజ్ ఔట్ అయ్యాడు. 


Also Read : WI VS AUS : 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్.. బోలాండ్ హ్యాట్రిక్.. 6 వికెట్లు తీసిన స్టార్క్

నాలుగో స్థానంలో టీమిండియా.. 


దీంతో టీమిండియా ఓటమి పాలైంది. టీమిండియా (Team India)  ఓటమి పాలు కావడంతో పాయింట్ల పట్టికలో వెనుకంజలో కొనసాగుతోంది. రెండో టెస్ట్ లో విజయం సాధించి మూడో స్తానంలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు మూడో టెస్ట్ లో ఓటమి పాలై నాలుగో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ తో మూడు టెస్టు మ్యాచ్ లు ఆడితే మూడింట్లో కూడా ఘన విజయం సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ జట్టు ఇండియాతో 3 మ్యాచ్ లు ఆడగా.. వాటిలో రెండింటిలో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక శ్రీలంక జట్టు 2 మ్యాచ్ లు ఆడితే 1 మ్యాచ్ లో విజయం సాధించగా.. మరో మ్యాచ్  డ్రా గా ముగిసింది. దీంతో శ్రీలంక జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇండియా జట్టు ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్ లు ఆడగా.. వాటిలో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇక ఆ తరువాత రెండో మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.  మూడో టెస్టులో అనూహ్యంగా ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఇండియా పాయింట్ల పట్టికలో వెనుకంజలోకి వచ్చేసింది.

టాప్ లో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా 

ఆస్ట్రేలియా (Australia) జట్టు 100 శాతం.. 36 పాయింట్లతో టాప్ లో దూసుకెళ్తోంది. అలాగే ఇంగ్లాండ్ (England)  జట్టు 66.67 శాతం.. 24 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక రెండో స్థానంలో ఉన్న శ్రీలంక జట్టు 16 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 33.33 శాతం తో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ జట్టు 2 మ్యాచ్ లు ఆడగా.. 1 మ్యాచ్ డ్రా కాగా.. మరో మ్యాచ్ లో శ్రీలంకపై ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. దీంతో 0 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి పాయింట్ల పట్టికలోో వాళ్ల స్థానాలు ఇంకా లేవు. వాళ్లు టెస్టు మ్యాచ్ ఆడితే వాళ్ల గెలుపు, ఓటమి లను బట్టి పాయింట్ల పట్టికలో మార్పులుంటాయి.

Related News

Heinrich Classen : నెలకొక టోర్నమెంట్… కాటేరమ్మ కొడుకు అంటే మామూలుగా ఉండదు… ప్రపంచంలోనే బిజీయస్ట్ క్రికెటర్

Ms Dhoni : MS ధోనీనే నా స్ఫూర్తి.. ఆయన రియల్ హీరో.. పాకిస్తాన్ కెప్టెన్ సంచలనం

Sehwag -Mendis : మిస్టరీ స్పిన్నర్ మెండిస్ కెరీర్ నాశనం చేసిన సెహ్వాగ్.. మరి వీరూతో పెట్టుకుంటే మాడి మసి కావాల్సిందే !

MS Dhoni: 43 బ్రాండ్లకు ధోని బ్రాండ్ అంబాసిడర్… కోహ్లీ కూడా వెనుకబడిపోయాడు..టాప్ 5 లిస్ట్ ఇదే!

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్… ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్తాన్.. చరిత్రలోనే తొలిసారి

Sikandar Raja : ఎవర్రా వీడు.. 39 ఏళ్ల వయసులో నెంబర్ వన్ ఆల్రౌండర్ గా చరిత్ర.. ఇంతకీ ఎవరీ సికిందర్ రాజా

Big Stories

×