Watch Video: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచం నలుమూలలా ఏం జరిగిన ఈజీగా తెలిసిపోతుంది. క్షణాల్లో న్యూస్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కెనడాలో ఓ భారతీయ జంట రోడ్డు పక్కన చెత్త విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం.
భారతీయ జంట తమ కారు నుంచి పెద్ద ప్లాస్టిక్ సంచులను తీసి, రోడ్డు పక్కన అడవిలో చెత్తను విసురుతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జంట భారతీయ సంతతికి చెందినవారని నెటిజన్లు ఊహించారు. అయితే వారు భారత్ కు చెందిన వారనే సమాచారం గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఈ సంఘటన సామాజిక బాధ్యత, ప్రజల ప్రవర్తనపై తీవ్రమైన విమర్శలకు దారితీసింది. అలాగే జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
They’ve destroyed India. We can’t let them destroy Canada next.
— Bruce (@bruce_barrett) July 13, 2025
ఈ వీడియోను బ్రూస్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దానికి ‘వారు భారతదేశాన్ని నాశనం చేశారు. కెనడాను కూడా నాశనం చేయనివ్వం’ అనే వివాదాస్పద క్యాప్షన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. కానీ జంట విసిరినవి చెత్తా లేదా పక్షులు లేదా వన్యప్రాణులకు ఆహారం వేస్తున్నారా..? అనేది స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ జంట ప్లాస్టిక్ సంచులను మాత్రం విసిరివేయకుండా తిరిగి కారులో పెట్టుకోవడం గమనార్హం.
ALSO READ: ICF Recruitment: టెన్త్ అర్హతతో 1010 ఉద్యోగాలు.. నెలకు రూ.7వేల స్టైఫండ్.. డోంట్ మిస్
ఈ సంఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొంతమంది.. ‘చెత్తను ఇలా పారేయడం ఏ మాత్రం సరికాదు’ అని కామెంట్ చేశారు. మరికొందరుఈ జంట బహుశా జంతువులకు ఆహారం వేస్తుండవచ్చని, లేదా ఏదైనా ఆచారం కోసం పూలు విసిరి ఉండవచ్చని సమర్థిస్తూ కామెంట్ చేశారు. ఒక వ్యక్తి చేసిన పనికి ‘ఒక దేశం మొత్తాన్ని నిందించడం సరికాదు, ఇది సామాజిక బాధ్యత గురించిన విషయం” అని మరి కొంత మంది కామెంట్ చేశారు. మరొకరు ‘వారు భారతీయులని ఎలా నిర్ధారించారు? వారు పాకిస్తానీ, బంగ్లాదేశీ లేదా నేపాలీ కూడా కావచ్చు’ అని కామెంట్ చేసుకోచ్చారు
ALSO READ: BHEL Recruitment: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ నీదే బ్రో
ఈ వీడియో కెనడాలో అక్రమంగా చెత్త విసిరే వారికి భారీ జరిమానాలు (రూ.3 లక్షల వరకు) లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ సంఘటన భారతీయ వలసదారులపై జాతి వివక్ష వ్యాఖ్యలను రేకెత్తించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై చర్చకు దారి తీసింది. ఈ వివాదం భారతీయ సంతతి వారు తమ ప్రవర్తన ద్వారా తమ సమాజాన్ని సానుకూలంగా ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది.