Railway Over Bridge: రోజూ స్కూల్ బస్సులు ఆగే చోటు ఇది. ఆటోలు హారన్‌లు కూతలు కూస్తూ ఆగిపోయే ట్రాఫిక్ పాయింట్ ఇదే… మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, పనిలో పడిన వాళ్లకైనా, ఓ చిన్న గేట్ తెరుచుకునే దాకా ఆగాల్సిందే. ఇప్పుడు మాత్రం ఆ గేట్ ఉన్న చోట… హై సింపుల్ బ్రిడ్జ్ వచ్చేసింది. ఇక అక్కడ బ్రేక్ అన్నదే ఉండదు. నాన్ స్టాప్ గా వెళ్తే, ఏం బ్రదర్ ఇది ఓవర్ బ్రిడ్జ్ ఏంటో చూడరా! అని బైక్‌పై వెళ్తున్నవారు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంతటి పరిస్థితి ఎక్కడ ఉంది? అసలు ఆ చిన్న బ్రిడ్జి వల్ల కలిగే ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం.
అవును, ఇదే తాజా న్యూస్. రైల్వే ట్రాక్ క్రాస్ కావాలంటే గంటల తరబడి ఆగాల్సిన ఒక చిన్న పట్టణానికి ఇప్పుడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) రూపంలో పెద్ద ఊరట లభించింది. ఖరగ్‌పూర్ – భద్రక్ మధ్య ఉండే జలేశ్వర్ అనే టౌన్‌లో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. కానీ ఈ చిన్న బ్రిడ్జ్ వల్ల కలిగే ప్రయోజనాలూ మాత్రం గంపలతో చెప్పుకోవచ్చు.
ఇంతకీ ఎవరికి లాభం?
ముందుగా అక్కడ ట్రాఫిక్ అంటే.. పీక్స్ టైంలో బస్సులు, ట్రక్కులు, ఆఫీసు వెళ్లే కార్లు, స్టూడెంట్ల బైక్స్ అన్నీ రైల్వే గేట్ ముందు నిలబడే డ్రామా ఉండేది. ఏదైనా రైలు దాటేటప్పుడల్లా ఆగాల్సిందే. ఒక్కోసారి 20 నిమిషాలు.. ఒక్కోసారి అరగంటలా. ఇప్పుడు ఆ గేటు కట్! ROB ఆ రూట్‌కి కొత్త జీవం పోసింది.
ఈ బ్రిడ్జ్ వల్ల ప్రయాణికులకు భద్రత పెరుగుతుంది. రైలు వచ్చినా వాహనాలు ముందుకు సాగిపోతాయి. ఇక రోడ్డుపై టైం వేస్ట్ లేదు, ప్రమాదాలూ లేవు. చదువుకునే పిల్లలైనా, మార్కెట్‌కి వెళ్లే అమ్మలైనా, అన్నీ గేట్ దగ్గర లైన్‌లో నిలబడాల్సిన రోజులు పోయాయి.
రెండు సైడ్‌లు.. ఒకే వేగం
ఈ బ్రిడ్జ్ ద్వారా మిగిలిన ప్రాంతాలకు కనెక్టివిటీ చాలా బాగా మెరుగవుతోంది. వస్తువుల రవాణా వేగవంతం అవుతుంది. పక్కనున్న గ్రామాల్లో వ్యవసాయం చేసి, పట్టణానికి అమ్మే రైతులకు ఇదో వరం లాంటి మార్గం. ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది రోజూ ఉపయోగపడే మార్గం కావడంతో వాళ్ల జీవితాల్లో బ్రిడ్జ్ ఒక భాగమే అయిపోయింది.
వీటన్నింటికీ తోడు, ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల స్థానిక యువతకి పనులు కూడా లభించాయి. బిల్డింగ్ వర్క్స్, ట్రాన్స్‌పోర్ట్, ప్లానింగ్ – ఇలా ప్రతి దశలోనూ స్థానిక జనాలే ఎక్కువగా పని చేశారు.
Also Read: Vande Bharat Train: ఈ రూట్‌లో వందే భారత్.. ఫస్ట్ టైమ్ వస్తోంది.. ఇక అక్కడ నో వెయిటింగ్!
ఎంత ఖర్చయిందో తెలుసా?
ఈ చిన్న కానీ బలమైన బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం రూ. 89 కోట్ల రూపాయలు వెచ్చించింది. పెద్దపెద్ద హైవేలు లాంటి నిర్మాణాలు కాదనుకుంటే కూడా, ఈ బ్రిడ్జ్ వెనక ఉన్న బాధ్యత, ప్రయోజనం మాత్రం గణనీయమే. ఇది సాధారణ బ్రిడ్జ్ కాదు.. ఒక ‘అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్’కు ఇచ్చిన అభివృద్ధి హామీ. ఓ చిన్న పట్టణాన్ని పెద్ద దేశ అభివృద్ధిలో కలిపే కనెక్షన్.
ఒరిస్సాలోనే..
ఇంతకీ ఈ బ్రిడ్జ్ ఎక్కడో తెలుసా? ఇది ఒరిస్సా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా, జలేశ్వర్ పట్టణంలో. Nua Odisha ra Nua Abhiyaan అంటే ఓడిశా కొత్త ప్రయాణం.. రైలు మౌలిక సదుపాయాలతో రాష్ట్రాన్ని రూపాంతరం చేయాలన్న అభియాన్ లో భాగంగా ఇది నిర్మించబడింది. ఓ చిన్న మార్పే కావచ్చు, కానీ ఓ పెద్ద ప్రయాణానికి అది నాంది అయ్యింది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఇలాంటి చిన్న పట్టణాల్లోనూ అభివృద్ధి చర్యలు చేపడుతూ రాష్ట్రాలను రైలు మార్గాల ద్వారా దేశ అభివృద్ధిలో కలుపుతోంది. జలేశ్వర్ ROB కూడా అదే మిషన్‌లో భాగం. పక్కవాళ్లకు చూసి పెద్దగా అనిపించకపోవచ్చు. ఇదేంటి బ్రిడ్జా? అని అనుకోవచ్చు. కానీ అక్కడి వారికి ఇది మార్పు. నిన్నటి వరకూ దాటి వెళ్లే రైలు కోసం నిలబడాల్సిన స్థలాన్ని, నేడు దూసుకుపోయే మార్గంగా మార్చిన ఈ ROB నిజంగా ఓ గర్వకారణం. ఇక అక్కడ బ్రేక్ లేదు.. ఓన్లీ రయ్ రయ్!