BigTV English
Advertisement

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

KL Rahul: భారత క్రికెట్ జట్టు స్టైలిష్ బ్యాటర్ కే.ఎల్ రాహుల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. గతంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమికి రాహుల్ కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ బాధను భరిస్తూ వచ్చిన ఈ వికెట్ కీపర్, బ్యాటర్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్ తో అదరగొట్టి కొత్త హీరోగా అవతరించాడు. తన అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో కూడా కె.ఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు.


Also Read: Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

ఈ 5 టెస్ట్ మ్యాచ్ లలోని 10 ఇన్నింగ్స్ లలో 532 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ తన ప్రతి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో చెప్పే ఓ మాస్టర్ క్లాస్ అనొచ్చు. బాల్ ని లేట్ గా, బాడీకి క్లోజ్ గా ఆడుతూ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బౌలర్లను విసిగించాడు. గిల్, జడేజాతో పాటు ఈ సిరీస్ లో 500 పైగా పరుగులు చేసిన మూడవ బ్యాటర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. బ్యాటింగ్ తో మాత్రమే కాకుండా ఫీల్డింగ్ లోను మంచి సహకారం అందించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఫీల్డర్ గా అత్యధిక క్యాచ్ లు పట్టిన మూడవ భారతీయ ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.


ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ మొత్తంగా 26 క్యాచ్ లు పట్టాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో ఫీల్డర్ గా 35 క్యాచ్లు పట్టిన సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో 30 క్యాచ్ లతో రాహుల్ ద్రావిడ్ నిలిచాడు. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ తో కేఎల్ రాహుల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఈ సిరీస్ లో కేఎన్ రాహుల్ ని అవుట్ చేసిన బౌలర్లకు యముడిలా మారాడు కె.ఎల్ రాహుల్. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టిన బౌలర్లు.. గాయం కారణంగా సిరీస్ కే దూరమయ్యారు.

ఈ ఆనవాయితీ మూడవ టెస్ట్ నుండి ప్రారంభమైంది. మూడవ టెస్ట్ లో ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్.. కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు. ఇక అనూహ్యంగా అదే టెస్ట్ లో గాయపడిన బషీర్.. ఈ సిరీస్ లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. అలాగే 4వ టెస్ట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు. ఇక అదే మ్యాచ్ లో బెన్ స్టోక్స్ కి పాత గాయం తిరగబడడంతో చివరి టెస్ట్ కి దూరమయ్యాడు. ఇక చివరి 5వ టెస్ట్ లో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత ఫీల్డింగ్ చేస్తూ క్రిస్ వోక్స్ భుజానికి గాయమైంది.

Also Read: Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

దీంతో అతడు ఉన్నపలంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా వోక్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి కూడా దిగలేదు. ఇలా మూడు టెస్టుల్లో కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టిన ముగ్గురు ఇంగ్లాండ్ బౌలర్లు గాయాల కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నారు. అయితే ఐదవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో జోష్ టంగ్.. కె.ఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు. ఇప్పుడు భయం అంతా జోష్ టంగ్ కి ఉందంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు.. తన వికెట్ తీసిన బౌలర్లకు కేఎల్ రాహుల్ శాపం పెడుతున్నాడు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Related News

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !

Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Big Stories

×