E-Paper
Advertisement

IND VS NZ Final : తస్మాత్ జాగ్రత్త.. పిచ్ ఫోటో ముందే ఫోటో తీసుకోండి.. న్యూజిలాండ్ కు ఇంజమామ్ వార్నింగ్

IND VS NZ Final : తస్మాత్ జాగ్రత్త.. పిచ్ ఫోటో ముందే ఫోటో తీసుకోండి.. న్యూజిలాండ్ కు ఇంజమామ్ వార్నింగ్
Advertisement

IND VS NZ Final : టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ మ‌రికొద్ది సేప‌ట్లోనే జ‌రుగ‌నుంది. అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోడీ స్టేడియం వ‌ద్ద హోరా హోరీ ఉత్కంఠ ఫైన‌ల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చాడు. జాగ్ర‌త్త‌.. పిచ్ కి సంబంధించి ముందు ఓ ఫొటో తీసుకోండి అంటూ న్యూజిలాండ్ కి ఇంజ‌మామ్ సూచించాడు.

Also Read : IND VS NZ Final : T20 ఫైనల్స్.. మోడీ స్టేడియం టీమిండియాకి క‌లిసి వస్తుందా? అభిషేక్ ఆడటంపై క్లారిటీ!

పిచ్ ఫోటో ముందే ఫోటో తీసుకోండి..

Advertisement

2023 వ‌న్డే వ‌ర‌ల్ క‌ప్ స‌మ‌యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఇలాగే పిచ్ ఫొటోల‌ను తీసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ కూడా పిచ్ ఫొటో ముందుగానే తీసుకోవాల‌ని ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ ప‌లు సూచ‌న‌లు చేస్తున్నాడు. ఒక‌వేళ ఫొటో తీసుకోక‌పోతే మ్యాజిక్ ఫిక్సింగ్ చేసే ఛాన్స్ ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చాడు ఇంజ‌మామ్. మ‌రోవైపు సెమీస్ లో టీమిండియా ఇంగ్లండ్ తో విజ‌యం సాధించిన స‌మ‌యంలో బుమ్రా బాల్ టాంప‌రింగ్ చేశాడ‌ని.. అత‌డినీ బ్యాన్ చేయండి అంటూ వింత వాద‌న తెర‌పైకి తీసుకొచ్చాడు ఇంజ‌మామ్.  మ‌రోవైపు టీమిండియా పై కొంద‌రూ నెగిటివ్స్ గా ట్రోలింగ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రూ మాత్రం కొన్ని ప్రాంతాల్లో టీమిండియా విజ‌యం సాధించాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. టీమిండియా ఓట‌మికి అంపైర్, అహ్మ‌దాబాద్ స్టేడియం, న్యూజిలాండ్ జ‌ట్టు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్టేడియానికి రావ‌డం వంటి టీమిండియా ఓట‌మికి గండాలు అని ట్రోలింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

టీమిండియా పై మ‌రోసారి విషం క‌క్కిన పాక్ మాజీ కెప్టెన్

టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ విషం కక్కేశాడు. బుమ్రా బాల్ టాంప‌రింగ్ కి పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేశాడు. టీమిండియా టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వవ‌ద్ద‌ని ఏదో ఒక విధంగా ఆరోప‌ణ‌లు చేస్తోంది పాకిస్తాన్. వాళ్లు టీమిండియా పై ఎంత నెగిటివిటీ ప్ర‌చారం చేస్తే.. టీమిండియా కి అంత పాజిటివిటి ఎన‌ర్జీ వ‌చ్చేస్తోంది. మ‌రోవైపు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ పై స్పందిస్తూ.. సౌతాఫ్రికాతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ లేదా అప్గానిస్తాన్ తో జ‌రిగిన తొలి మ్యాచ్ కంటే ఫైన‌ల్ మ్యాచ్ భిన్నంగా ఏమీ ఉండ‌ద‌ని తెలిపాడు. వాస్త‌వానికి మ్యాచ్ కి ముందు అంతా క‌ష్ట‌ప‌డ‌తార‌ని.. మీ ఆట‌ను ప‌రిశీలిస్తార‌ని.. అందుకు వీడియోల‌ను విశ్లేషిస్తార‌ని.. అలాంటి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుంటారని తెలిపారు. మీ ప్ర‌ణాళిక‌ల‌ను సాధ్య‌మైనంత ఉత్త‌మంగా అమ‌లు చేసేందుకు మైదానంలోకి అడుగుపెడ‌తార‌ని చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్న‌ర్. కీల‌క ఫైన‌ల్ మ్యాచ్ లో ఎవరు ఆధిప‌త్యం చెలాయిస్తారో వేచి చూడాలి.

Advertisement

Also Read : Inzamam ul haq: బుమ్రా బాల్ టాంప‌రింగ్ చేశాడు, అతన్ని బ్యాన్ చేయండి !

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×