IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ పూర్తయింది. జనవరి 11వ తేదీన ప్రారంభమైన ఈ వన్డే సిరీస్ నిన్నటితో ముగిసింది. అయితే కొత్త సంవత్సరంలో జరిగిన ఈ వన్డే సిరీస్ టీమ్ ఇండియాకు పీడకలను మిగిల్చింది. కచ్చితంగా గెలుస్తామని విర్రవీగుతో ముందుకు వెళ్లిన టీమిండియా దూకుడుకు న్యూజిలాండ్ అడ్డుగా నిలిచింది. దీంతో ఈ వన్డే సిరీస్ ను 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. దీంతో పలు చెత్త రికార్డులు నమోదు చేసుకుంది టీమిండియా.
Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయర్ మెడ పట్టుకుని తోసేసిన కోహ్లీ..బంతిని తన్ని మరీ రెచ్చిపోయాడుగా
న్యూజిలాండ్ చేతిలో 3 వన్డేల సిరీస్ ను కూల్పోయిన టీమిండియా, సొంత గడ్డపై వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నాయి రికార్డులు. అలాగే 37 సంవత్సరాల తర్వాత ఇండియాలో వన్డే సిరీస్ గెలిచిందట న్యూజిలాండ్. ఇక ఇప్పటివరకు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో వరుసగా ఏడు వన్డేల్లో టీం ఇండియా గెలిచింది. కానీ నిన్నటితో తొలి ఓటమి నమోదు చేసుకున్న టీమిండియా.. విజయాలకు బ్రేక్ పడింది.
టీమిండియా ఓటమికి ముఖ్యమైన కారణాలు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్, డేంజర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఈ ముగ్గురు దరిద్రుల వల్ల టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందుగా రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకున్నట్లయితే… రవీంద్ర జడేజాకు రాజకీయాల కారణంగానే వన్డేలో అవకాశం వచ్చిందని అంటున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. గతంలో బ్యాటింగ్ లేదా బౌలింగ్.. అది కాకపోతే ఫీల్డింగ్ లో రాణించే రవీంద్ర జడేజా… ఈ వన్డే సిరీస్ లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఏజ్ పైబడినప్పటికీ.. వన్డేలలో ఆడుతున్నాడు. ఇకనైనా వన్డేలకు రిటైర్మెంట్ రవీంద్ర జడేజా ఇవ్వాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇక టీమ్ ఇండియా ఓటమికి మరో కీలక దుర్మార్గుడు గౌతమ్ గంభీర్ కారణం అంటున్నారు. హెడ్ కోచ్ బాధ్యతల కంటే.. టీమిండియా కెప్టెన్గా గౌతమ్ గంభీర్ ఎక్కువగా పనిచేశాడని ట్రోలింగ్ చేస్తున్నారు. గిల్ ను కాదని గౌతమ్ గంభరాన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల టీమిండియా అట్టర్ ఫ్లాప్ అయిందని ఫైర్ అవుతున్నారు. ప్రసిద్ కృష్ణ పెద్ద తోపు బౌలర్ అని.. అర్షదీప్ సింగ్ కు మొదటి రెండు వన్డేలలో ఛాన్స్ ఇవ్వలేదు గంభీర్. దీంతో అప్పటికే టీమిండియా కొంప మునిగిపోయింది. మూడవ వన్డేలో అవకాశం ఇచ్చినా ప్రమాదం జరిగిపోయింది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం కూడా గంభీర్ చేయడం నష్టాన్ని మిగిల్చింది. గిల్ చెత్త కెప్టెన్సీ కారణంగా కూడా టీమిండియా ఓడిపోయింది.
ఈ సమయానికి ఏ బౌలర్ను వాడుకోవాలి ? ఎప్పుడు ఎవడిని బరిలో దించాలి? ఫీల్డింగ్ సెటప్… తదితర అంశాలను అమలుపరచడంలో గిల్ విఫలమయ్యాడు. మూడవ వన్డేలో గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు. రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్లో ఆడక పోవడం టీమిండియా కు మైనస్. అటు కుల్దీప్ యాదవ్ ఎన్నడు లేని విధంగా చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. మూడవ వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి మొదట బ్యాటింగ్ చేసినప్పుడు చాలా బంతులు మింగేసాడు. ఆ తర్వాత పికప్ అందుకున్నప్పటికీ.. అర్థ సెంచరీ తర్వాత అవుట్ అయ్యి విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ మొదటి నుంచి స్లో బ్యాటింగ్ చేసి ఆస్కింగ్ రేట్ పెరిగేలా చేశాడు. ఇలా టీమిండియా ఓటమికి 100 కారణాలు ఉన్నాయి.
🚨 Why India lost the ODI Series vs New Zealand?
➯ Gautam Gambhir is captain and coach, Shubman is Puppet 🤡
➯ Poor captaincy & coaching — failed team selection and terrible bowling rotation.
➯ Arshdeep ignored, Prasidh preferred — favoritism cost India.
➯ Ravindra Jadeja… pic.twitter.com/hySKoR0rTG
— Jara (@JARA_Memer) January 18, 2026