BigTV English

Shubman: గిల్ డబుల్ సెంచరీ.. న్యూజిలాండ్‌కు బిగ్ టార్గెట్

Shubman: గిల్ డబుల్ సెంచరీ.. న్యూజిలాండ్‌కు బిగ్ టార్గెట్


Shubman: ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.

కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3), కుల్దీప్ యాదవ్ (5), షమి (2) పరుగులు చేశారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసి న్యూజిలాండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


శుభ్‌మన్‌గిల్ 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశారు.

19వ వన్డే ఆడుతున్న గిల్.. కెరీర్ లో వెయ్యి పరుగుల మైలురాయిని దాటేశాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ 24 వన్డేల్లో వెయ్యి రన్స్ చేయగా.. గిల్ 19 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు.

Related News

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లోకి నమీబియా, ఇట‌లీ ఎంట్రీ…17 జ‌ట్లు రెడీ…మ‌రో 3 జ‌ట్లు లోడింగ్

KL Rahul: విండీస్ కేఎల్ రాహుల్ సూప‌ర్ సెంచ‌రీ…విజిల్స్ వేస్తూ బీసీసీఐకి వార్నింగ్ ఇచ్చాడా ?

Tilak Verma : సిరాజ్ లాగే… తిల‌క్ వ‌ర్మ‌కు డీఎస్పీ ప‌ద‌వి ?

BANW Vs PAKW : బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఓటమి… ఉమెన్స్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక ఇదే

Nashra Sandhu Hit Wicket: ఇండియాను అవ‌మానించింది..హిట్ వికెట్ అయి ప‌రువుతీసుకుంది… పాక్ లేడీపై ట్రోలింగ్‌

BAN W vs PAK W: కామెంట్రీలో అజాద్ కశ్మీర్ అంటూ వ్యాఖ్యలు…క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌నంటూ సనా మిర్‌ పోస్టు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ‌ ఇంట పెళ్లి సంద‌డి..తీన్మార్ స్టెప్పులేసిన యువ‌రాజ్‌

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Big Stories

×