E-Paper
Advertisement

Khammam: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి!.. ఖమ్మం సభ బూమరాంగ్?

Khammam: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి!.. ఖమ్మం సభ బూమరాంగ్?
Advertisement

Khammam: ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్. నిజంగానే లక్షలాది మంది ప్రజలు సభకు తరలివచ్చారు. వేదికపై నలుగురు సీఎంలు, ఓ మాజీ సీఎం ఆసీనులయ్యారు. అంతా మంచి స్పీచ్ ఇచ్చారు. కేసీఆర్ గ్రేట్ అని, కంటి వెలుగు కార్యక్రమం బాగుందని.. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ బహు బాగుందని ప్రశంసించారు. వచ్చిన ఆహ్వానితులంతా.. పిలిచినందుకు కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. సభ సక్సెస్ అయిందని అనిపించారు.

అంతేనా? ఇంకేం లేదా? అనే చర్చ మొదలైంది. వచ్చారు.. హెలికాప్టర్ లో తిరిగారు.. యాదాద్రి సందర్శించారు.. ఖమ్మం వెళ్లారు.. సభలో మాట్లాడారు.. కేంద్ర బీజేపీని తిట్టిపోశారు.. ఇంతేనా? ఇంకేం లేదా? అంటున్నారు.

Advertisement

అనుకున్నదొక్కటి అయింది ఇంకొకటి. ముగ్గురు సీఎంలు ఎక్కడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు. కనీసం బీఆర్ఎస్ ను స్వాగతించలేదు. కేసీఆర్ జాతీయ నాయకుడు అని కూడా చెప్పలేదు. కేసీఆర్ వెంటే మేమంతా అని కూడా అనలేదు. కేసీఆర్ తో కలిసి పని చేస్తామని గానీ.. కేసీఆర్ కింద పని చేస్తామని కానీ.. క్లారిటీ ఇవ్వలేదు. ఎవరి సొంత స్పీచ్ లు వారు ఇచ్చారే కానీ.. ఎక్కడా బీఆర్ఎస్ గురించి కానీ, కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కానీ.. మాట్లాడలేదు. దేశ్ కి నేత.. అంటూ తనకు తాను తెగ ప్రమోట్ చేసుకుంటున్న గులాబీ బాస్ ను.. ఆ వేదికపై ఆసీనులైన ఏ ఒక్కరు కూడా కేసీఆర్ ను ‘దేశ్ కీ నేత’.. అంటూ కితాబు ఇవ్వలేదు.

ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనేది సామెత. అలానే.. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్.. కేసీఆర్ అనుకున్నది అట్టర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు. ఖమ్మం సభ ఎందుకోసం పెట్టారో అర్థం కావట్లేదంటున్నారు. కేసీఆర్ స్పీచ్ సైతం చప్పగా ఉందని చెబుతున్నారు. పాత క్యాసెటే మళ్లీ రిపీట్ చేశారని.. కొత్తగా ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పలేదని తీసిపడేస్తున్నారు. బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచీ చెబుతున్న మాటలే.. మళ్లీ ఖమ్మం సభలో చెప్పారని.. అందుకే సభ తుస్ మందనే టాక్ నడుస్తోంది.

Tags

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×