IND VS PAK: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. కాశ్మీర్ ప్రాంతం కారణంగా ఈ రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే, అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు పాకిస్తాన్ వాడు సహాయం చేస్తే ఎలా ఉంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా కచ్చితంగా ఈ అంశం హాట్ టాపిక్ కావడం గ్యారెంటీ. అయితే అచ్చం అలాంటి సంఘటనే తాజాగా ఒకటి జరిగింది. పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ ప్లేయర్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. బహ్రెయిన్ దేశంలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో భారత జట్టు తరుపున పాకిస్తాన్ కబడ్డీ ఆటగాడు ఆడి వివాదానికి తెరలేపాడు. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ కబడ్డీ ప్లేయర్ వివాదానికి తెర లేపాడు. పాకిస్తాన్ దేశానికి చెందిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్ ( Ubaidullah Rajput ) ఇండియా జట్టు తరఫున ఆడి పెంట పెంట చేశాడు. బహ్రెయిన్ దేశంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మన ఇండియాకు సంబంధించిన జెర్సీని ధరించి, జెండాను కూడా ఎగరవేశాడు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ ( Pakistan Kabaddi Federation ) సీరియస్ అయింది. పాకిస్తాన్ కబడ్డీ క్రీడాకారుడు ఉబైదుల్లా రాజ్‌పుత్ పై విచారణకు ఆదేశాలు కూడా ఇచ్చింది. బోర్డు అనుమతి లేకుండా విదేశీ మ్యాచ్ లలో పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే.
అందులోనూ ఇండియాకు ( Team India) ఆడడం దేశానికి ద్రోహం చేసినట్లే అంటూ పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ సెక్రటరీ రాణా సర్వార్ స్పష్టం చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే పాకిస్తాన్ కబడ్డీ క్రీడాకారుడు ఉబైదుల్లా రాజ్‌పుత్ ( Ubaidullah Rajput ) క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ తగ్గడం లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని ఫెడరేషన్ వెల్లడిస్తోంది. పాకిస్తాన్ జాతీయ గౌరవాన్ని అవమానించి ఇండియాకు వాడడం దేశద్రోహమే అని పేర్కొంటోంది. దీని కచ్చితంగా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్. ప్రాథమికు సమాచారం మేరకు ఇండియాకు ఆడిన పాకిస్తాన్ కబడ్డీ క్రీడాకారుడు ఉబైదుల్లా రాజ్‌పుత్ ( Ubaidullah Rajput ) పై కఠిన శిక్ష పడే ప్రమాదం ఉంది. అతడు ఇక కబడ్డీ ఆడకుండా వేటు వేయనున్నారు.
Pak kabaddi player row ⚠️#KabaddiNews #PakistanSports #SportsControversy #InternationalSports #Awareness pic.twitter.com/s9cnLMbsoC
— Laughing Colours (@LaughingColours) December 19, 2025