Bizarre Run Out: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతుంటే… అటు… మహిళల టీమ్ ఇండియా కూడా… ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతోంది. టీమిండియా మహిళల జట్టు వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England ) మధ్య.. నిన్నటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైంది. అయితే మొదటి వన్డే మ్యాచ్… నిన్న జరగగా… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మొదటి వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా మహిళల జట్టు ( Team India Women’s Team ) ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే మ్యాచ్ గెలిచినప్పటికీ… కూడా.. టీమిండియా బద్ధకం బయటపడింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ హర్లీన్ డియోల్ ( Harleen Deol ) బద్ధకం
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England ) మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో 27 ఏళ్ల హర్లీన్ డియోల్ ( Harleen Deol ) తన బద్దకాన్ని ప్రదర్శించింది. సింపుల్గా… పరుగు వస్తే.. బద్ధకంగా వ్యవహరించి రన్ అవుట్ అయింది టీమిండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే జరగగా… ఇందులో మొదట ఇంగ్లాండు మహిళల జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా… సెకండ్ బ్యాటింగ్ చేసి చేజింగ్ చేసిన టీమిండియా.. అవలీలగా విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టీమిండియా మహిళా క్రికెటర్ ( Team India Women’s Team ) హర్లీన్ డియోల్ రనౌట్ అయ్యారు. 44 బంతుల్లో 27 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ నాలుగు బౌండరీలు కూడా కూడా సాధించారు. అయితే… మ్యాచ్ మంచి రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. కాస్త లేజీగా వ్యవహరించిన మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ …. 27 పరుగుల వద్ద రన్ అవుట్ అయింది. డేవిడ్సన్ రిచర్డ్స్.. చాలా తెలివిగా వికెట్లను బాదేసింది. దీంతో ఆమె గ్రీజులోకి చేరుకున్నప్పటికీ.. హర్లీన్ డియోల్ అవుట్ అయ్యారు. బ్యాట్ క్రీజులో పెట్టకుండా లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రనౌట్ అయ్యారు.
నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం
టిమిడియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో మహిళల టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన మహిళల ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 258 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఛేదించింది టీమిండియా. దీంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది.
Harleen 🫡 pic.twitter.com/2idDu9dysL
— Out Of Context Cricket (@GemsOfCricket) July 16, 2025