నీళ్లు, నిధులు, నియామకాలు.. వీటన్నిట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టే కేసీఆర్ అండ్ టీమ్ ని పక్కనపెట్టారు తెలంగాణ ప్రజలు. మళ్లీ ఇప్పుడు అవే మాటలతో ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు సిద్ధమయ్యారు కేటీఆర్. బనకచర్ల విషయంలో కేటీఆర్ రాద్ధాంతం అందుకే. తెలంగాణ నీళ్ల విషయంలో రాజీపడేది లేదని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు చెబుతుంటే.. బనకచర్లకు అనుమతులొచ్చేసినట్టు, నీళ్లు ఏపీకి తరలిపోతున్నట్టు రెచ్చిపోతున్నారు కేటీఆర్. వాస్తవానికి ఇక్కడ కేటీఆర్ కి కావాల్సింది రాజకీయ లాభం. అందుకే ఆంధ్రప్రదేశ్ పై నిందలు మొదలు పెట్టారు. ఆ నెపంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ని టార్గెట్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇదే వ్యూహంతో వెళ్లాలనేది ఆయన ప్లాన్. అయితే దీన్ని ప్రజలు తిప్పికొట్టడం గ్యారెంటీ.
కేసీఆర్ చేసిందే..!
అసలు బనకచర్ల ఆలోచన వచ్చింది ఎరి హయాంలో? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న సూటి ప్రశ్న ఇది. రాయలసీమకు పెద్దన్నలా ఉంటానంటూ గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ వైసీపీ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఏపీవాడుకునే విధంగా చేస్తామన్నారు. అందుకే బనకచర్ల ఆలోచన వచ్చిందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ చేసిన తప్పుని తాము సరిచేస్తుంటే తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలు తాము చేస్తున్నామని అన్నారు. మొత్తమ్మీద బనకచర్ల విషయంలో కేసీఆర్ అండ్ కో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది.
బనకచర్ల పేరుతో బీఆర్ఎస్ నాటకం
రాజకీయ పబ్బం గడుపుకునే ఆరాటం@revanth_anumula @UttamINC #banakacherlaproject pic.twitter.com/drMz75LJCX
— Telangana Congress (@INCTelangana) July 17, 2025
ఎన్నికలు వస్తున్నాయంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పని. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇదే పద్ధతి ఫాలో కావాలనుకుంటున్నారు కేటీఆర్. బనకచర్లపై అందుకే రాద్ధాంతం మొదలు పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుని, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఏపీ ప్రాజెక్ట్ లకు తెలంగాణ సీఎం మద్దతిస్తున్నారంటూ నిందలు వేస్తున్నారు. కేవలం ఎన్నికలకోసమే కేటీఆర్ ఈ స్టాండ్ తీసూుకున్నారని తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కి మరింత గట్టిగా బుద్ధి చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా ఘోర పరాభవం పాలైన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పటికీ చక్కబడలేదు. అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని మరింతగా నాశనం చేశాయి. అన్న చెల్లెలు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అటు కేసీఆర్ ఏవైపు చెప్పాలో తెలియక కిందామీదా పడుతున్నారు. ఈ దశలో కేటీఆర్ మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. మేడిగడ్డ వ్యవహారంలో పడిన మచ్చని తొలగించేందుకు నెపం కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కేటీఆర్.
Live: సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/eKb89C7Czi
— BRS Party (@BRSparty) July 17, 2025
సోదరి కవిత విషయంలో కూడా కేటీఆర్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కవితపై మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల్ని కూడా కేటీఆర్ ఖండించలేదు. కేటీఆర్ అనుమతి లేకుండా బీఆర్ఎస్ లో కూడా ఎవరూ మాట్లాడలేరు కాబట్టి.. పార్టీ నుంచి కూడా కవితకు సపోర్ట్ లభించలేదు. దీంతో కవిత మద్దతుదారులు, ఆమె అభిమానులు, జాగృతి కార్యకర్తలు.. కేటీఆర్ ని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేశారు. రేపు స్థానిక ఎన్నికల్లో కవిత వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.