Rahul Dravid: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా బుధవారం రోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనుకున్నంత ఉత్కంఠ రేకెత్తించలేదు. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో కలకత్తా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కలకత్తా కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
Also Read: Sunil Narine: ఐపీఎల్ టోర్నమెంట్ కు సునీల్ నరైన్ గుడ్ బై?
ఈ క్రమంలో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రమం తప్పకుండా వికట్లు కోల్పోతూ ఎదురు దెబ్బకు గురైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుండి పెద్ద స్కోర్ రాకపోవడం రాజస్థాన్ రాయల్స్ ని దెబ్బతీసింది. ఓపెన్ యశస్వి జైష్వాల్ కేవలం 29 పరుగులతో తేలికపాటి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ.. కెప్టెన్ సంజూ శాంసన్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రియాన్ పరాగ్ 25, దృవ్ జురెల్ 33 పరుగులతో కాస్త ప్రయత్నించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 151 పరుగులకే పరిమితమైంది.
ఇక కలకత్తా బౌలర్లలో పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కలకత్తా నైట్ రైడర్స్.. 50 పరుగులు కూడా చేయకుండానే మొదటి వికెట్ కోల్పోయింది. అజింక్య రహనే 18 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన బ్యాటింగ్ తో కలకత్తా జట్టును ఆదుకున్నాడు. హఫ్ సెంచరీ చేసిన అనంతరం మరింత దూకుడుగా ఆడి 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
అతనికి రఘువంశీ 27 పరుగులతో సహకారం అందించడంతో కలకత్తా విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం మైదానంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ {Rahul Dravid}.. తన కాలికి గాయమైనప్పటికీ జట్టు కోసం కాలికి పెద్ద కట్టుతో టీమ్ తోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వీల్ చైర్ లోనే ద్రావిడ్ గ్రౌండ్ లోకి వచ్చాడు.
Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్… బీసీసీఐ కీలక ప్రకటన!
అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాడు, రాజస్థాన్ ఓటమిని శాసించిన క్వింటన్ డికాక్ తో మాట్లాడి అతడిని అభినందించాడు. ఈ క్రమంలో డికాక్ తో ద్రావిడ్ మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడ్ చైర్ లో మైదానంలోకి వచ్చి ప్రత్యర్థి ఆటగాడికి అభినందనలు తెలపడం ద్రావిడ్ కే చెల్లుతుందని, అంతటి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంది కాబట్టే అన్ని సంవత్సరాలు అంతర్జాతీయ కెరీర్ లో ఎటువంటి వివాదాలు లేకుండా ద్రావిడ్ {Rahul Dravid}పేరు తెచ్చుకున్నాడని క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.