Ind vs NZ: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) న్యూజిలాండ్ జట్టును టీమిండియా చిత్తు చేసింది. ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా…. న్యూజిలాండ్ ను దారుణంగా ఓడించింది. ఇవాళ జరిగిన గ్రూప్ స్టేజి లో 44 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి… ఏకంగా ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. అటు న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 81 పరుగులతో ఎంత పోరాడిన.. టీమిండియా స్పిన్నర్ల దాటికి కివీస్ నిలువలేకపోయింది. ఈ తరుణంలోనే 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది టీమిండియా.
Also Read: Nz vs Ind: ఫిలిప్స్ క్యాచ్ అదుర్స్..షాక్ లో అనుష్క శర్మ కోహ్లీ.. కష్టాల్లో టీమిండియా?
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… చాలా కష్టపడి 249 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు ఇద్దరు, అలాగే మొదటి వికెట్ కు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. అయినప్పటికీ నిర్ణయిత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన టీమిండియా 249 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 98 బంతుల్లో 79 పరుగులు చేసి రాణించాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకునేందుకు శ్రేయస్ అయ్యర్ ( Shreyas iyer ) అలాగే ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇక చివర్లో టీమిండియా మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 45 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. తన శాయశక్తుల సిక్సులు అలాగే బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాడు హార్థిక్ పాండ్యా. దీంతో 249 పరుగులు చేసింది టీమిండియా. అయితే 250 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్… మొదట్లో బాగానే ఆడింది.
Also Read: Wpl 2025: టోర్నమెంట్ నుంచి RCB ఔట్…. సెమిస్ వెళ్లే జట్లు ఇవే.. ఇదిగో లెక్కలు?
కేన్ మామ ఒక్కడే 81 పరుగులు చేసి… న్యూజిలాండ్ ను గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ కేన్ మామకు మిగతా ఆటగాళ్లు ఎవరు సపోర్ట్ చేయలేదు. టీమిండియా స్పిన్నర్ల దాటికి.. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎక్కడ కూడా తట్టుకోలేక పోయారు. బ్యాటింగుకు రావడం…వికెట్ సమర్పించుకోవడం.. పెవిలియన్ కు వెళ్లడమే సరిపోయింది. దీంతో 45.3 ఓవర్లలోనే… న్యూజిలాండ్ 205 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఈ తరుణంలోనే 44 పరుగుల తేడాతో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టి.. పాయింట్స్ టేబుల్ లో కూడా మొదటి స్థానానికి ఎగబాకింది. అటు టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy ).. 10 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ దెబ్బకు న్యూజిలాండ్ కోలుకోలేక పోయింది. ఇక తొలి సెమీఫైనల్… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రెండో సెమీ ఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మేరకు దాదాపు షెడ్యూల్ ఫైనల్ అయినట్లే. టీం ఇండియా ఆడే సెమీఫైనల్ దుబాయ్ వేదికగా జరిగితే… మరో మ్యాచ్ మాత్రం పాకిస్తాన్ లో నిర్వహిస్తారు.