Morne Morkel Father Demise: ప్రతిష్టాత్మక ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటినుండి { ఫిబ్రవరి 19} ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నికి పాకిస్తాన్ హోస్ట్ కంట్రీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్లు రేపు తలపడబోతున్నాయి. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్ ని ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ఆడబోతోంది. ఈ టోర్నీ ఆరంభానికి కొన్ని గంటల ముందు టీమిండియాకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: SRH Flag At Himalayas: హిమాలయాలపై SRH జెండా.. ఫుల్ జోష్ లో కావ్య పాప!
భారత ప్రధాన బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్.. జట్టును వీడి తన స్వదేశం సౌత్ ఆఫ్రికాకి వెళ్లిపోయాడు. మొర్కెల్ తండ్రి ఆల్బర్ట్ {Morne Morkel Father Demise} మరణించడంతో అతను సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సి వచ్చింది. తండ్రి హఠాన్మరణం కారణంగా మోర్కెల్ భారత జట్టును వీడి.. తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఈ టోర్నీ కోసం భారత జట్టుతో కలిసి దుబాయ్ వెళ్లిన మొర్కెల్.. ఆదివారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. కానీ సోమవారం మాత్రం అతడు జట్టుతో కనిపించలేదు. తండ్రి మరణ వార్త {Morne Morkel Father Demise} తెలియగానే వెంటనే బీసీసీఐ అనుమతి తీసుకొని హుటాహుటిన దుబాయ్ నుండి సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయినట్లు సమాచారం.
అనారోగ్య కారణాలతో మరణించిన తన తండ్రి ఆల్బర్ట్ అంతిమ వీడ్కోలులో పాల్గొనేందుకు {Morne Morkel Father Demise} వెళ్ళాడు. అయితే మొర్కెల్ తిరిగి ఎప్పుడు వస్తాడనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. తొందరగా అతడు ఈ బాధ నుండి బయటపడి.. తిరిగి మళ్లీ భారత జట్టుతో కలవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఓవైపు ఇప్పటికే బౌలర్ల సమస్యతో భారత జట్టు ఇబ్బందుల్లో ఉంది. ప్రధాన బౌలర్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్ ట్రోఫీకి దూరమయ్యాడు.
ఇక జట్టుతో ఉన్న ఏకైక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఒక్కడే. అతడు కూడా పెద్ద టచ్ లో లేడు. ఇక మిగిలిన ఇద్దరు అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా యంగ్ బౌలర్స్. వీరికి వన్డేల్లో పెద్దగా అనుభవం లేదు. ఇలాంటి సమయంలో జట్టుతో ప్రధాన బౌలింగ్ కోచ్ లేకపోవడం, బౌలర్లను టోర్నీకి ట్రైన్ చేయడం కష్టంగా మారుతుంది. ఈ సమస్య హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ పై ఒత్తిడిని పెంచుతుంది.
Also Read: IPL 2025 – SRH Final: ఫైనల్ కు చేరిన SRH… ఐపీఎల్ చైర్మన్ ప్రకటన ?
ఈ నేపథ్యంలో మొర్కెల్ కి ప్రత్యామ్నాయంగా ఎవరినైనా బౌలింగ్ కోచ్ గా తీసుకుంటారా..? లేక మొర్కెల్ వీలైనంత త్వరగా మళ్లీ టీమ్ తో జత కలుస్తాడా..? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ సమయానికి మోర్ని మోర్కేల్ అందుబాటులోకి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.