Harish Kumar : కొన్నిసార్లు కొందరి నటుల పేర్లు చెప్పగానే మనం గుర్తుపట్టవచ్చు. కానీ వాళ్లు నటించిన సినిమాల ప్రస్తావన తీసుకొస్తే, టక్కున గుర్తుకు వస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది నటులను మనం మర్చిపోతూ ఉంటాం. రీసెంట్ టైమ్స్ లో బాగా హిట్ అయిన సినిమాలలో ఆ నటులు కనిపించినప్పుడు వీళ్ళని ఎక్కడో చూసామే అని అనిపిస్తుంది. ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఆ నటుల గతంలో చేసిన వర్క్ చూసి ఆశ్చర్య పడుతుంటాం. ఇక నటుడు హరీష్ కుమార్ గురించి ఇప్పుడు ఉన్న జనరేషన్ కి కొంచెం తెలియకపోయినా ఒకప్పుడు యూత్ కి మాత్రం బాగా తెలిసిన హీరో. ప్రేమఖైదీ,కూలి నెంబర్ వన్, తిరంగా వంటి సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు హరీష్.
కేవలం నటుడు గానే కాకుండా బాల నటుడుగా కూడా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆంధ్ర కేసరి సినిమాకి బాల నటుడిగా అప్పటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేతులమీదుగా నంది అవార్డును కూడా అందుకున్నాడు. హరీష్ కుమార్ ను డి రామానాయుడు ప్రేమ ఖైదీ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ అవడంతో ఇదే సినిమాను హిందీలో కూడా నిర్మించారు. హరీష్ కుమార్ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి పెద్ద పెద్ద నటులతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం,తమిళ్, కన్నడ భాషల్లో కూడా హరీష్ కుమార్ అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించుకున్నారు. సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప సినిమాలు చేసిన హరీష్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నాడు అసలు ఏమైపోయాడు అని ఆలోచనలు చాలామందికి మొదలయ్యాయి.
ఈ తరుణంలో హరీష్ కుమార్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే. హరీష్ కుమార్ ఇటీవల తన హిమాలయ ఇంటికి వెళ్లి, శ్రీ హెచ్. పరమ పూజ్య స్వామి చిదానంద సరస్వతిజీ – మునిజీని కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. కుమార్జీ పిలుపు ఉంటేనే సందర్శించగలనని అనుకునేవారు. కానీ, ఏదో పని మీద డెహ్రాడూన్ కు వెళ్ళినప్పుడు, పూజ్య స్వామీజీ స్వరం అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తూ, తనను కలవమని సూచించింది. అలానే గంగా ఒడ్డున ఉన్న దివ్య ఆర్తి అనుభవాన్ని కూడా ఆయన పంచుకున్నారు. పూజ్య స్వామీజీ అందమైన మృదువైన స్వరంతో కూడా ఆయన ఆకర్షితులయ్యారు. ఆయన మృదువుగా మాట్లాడినప్పటికీ, ఆయన మాటలు ఒకరి హృదయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని హరీష్ కుమార్ పేర్కొన్నారు.
Also Read : Allu Arjun : నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఫిక్స్… రామ్ చరణ్ హీరోయిన్ తో బన్నీ రొమాన్స్ ?