BigTV English

Rahul Gandhi Latest Tweet: డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు డబుల్ దెబ్బ..! రాహుల్ ట్వీట్..

Rahul Gandhi Latest Tweet: డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు డబుల్ దెబ్బ..! రాహుల్ ట్వీట్..

Rahul Gandhi Latest Tweet On UP Unemployment: ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగుల పరిస్తితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ X వేదికగా స్పందించారు. యూపీలో కొనసాగుతొన్న బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగుల పరిస్థితి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు డబుల్ దెబ్బ అని తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలను విమర్శించారు.


ఇవ్వాళ యూపీలో ప్రతి యువకుడు నిరుద్యోగం అనే వ్యాధితో భాదపడుతున్నాడని అన్నారు. 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న చోట, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్‌డి హోల్డర్లు కనీస విద్యార్హత ఉన్న పోస్టుల కోసం కూడా లైన్‌లో నిలబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. .

ఇక్కడ రిక్రూట్ మెంట్ జరగడం ఒక కల అని రాహుల్ అన్నారు. ఒకవేళ రిక్రూట్ మెంట్ జరిగితే పేపర్ లీక్ అవుతుందని, పేపర్ ఇస్తే ఫలితాలు తొందరగా రావని, వాటికోసం నెలల తరబడి వేచి చూసి, ఫలితం వచ్చిన తర్వాత అది కోర్టుకి చేరడం జరుగుతోంది. నిరుద్యోగి తరచుగా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నారు. ఆర్మీ నుంచి రైల్వే వరకు, విద్యావిభాగం నుంచి పోలీస్ ఉద్యోగాల వరకు ప్రతీ ఉద్యోగం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షీస్తూ లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మారారని తెలిపారు.


Read More: వికసిత్ భారత్ గ్యారంటీ నాదే.. ప్రధాని మోదీ హామీ..

ఈ నిరాష్యపు చిట్టడవిలో చిక్కుకున్న విద్యార్థి డిప్రెషన్‌కు గురై కుంగిపోతున్నారని, వీటన్నిటితో బాధపడుతూ.. తమ డిమాండ్లతో వీధుల్లోకి వచ్చినప్పుడు పోలీసుల నుండి లాఠీ దెబ్బలు తింటున్నాడని ఆవేదన వ్యక్త పరిచారు.

ఒక విద్యార్థికి, ఉద్యోగం అనేది ఆదాయ వనరు మాత్రమే కాదు, అతని కుటుంబ జీవితాన్ని మార్చే కల. ఈ కల చెదిరిపోవడంతో, మొత్తం కుటుంబం యొక్క ఆశలు అడియాశలవుతున్నాయని అన్నారు. ఇంకొన్నాళ్లు వేచి చూడాలని, కాంగ్రెస్ విధానాలే యువత కలలకు న్యాయం చేస్తాయని, వారి తపస్సు వృథా కాదని ట్విట్ లో రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×