BigTV English

Sunil Chhetri Retirement: కాసింత ఉద్వేగం.. ఫుట్‌బాల్ ఆటకు సునీల్ గుడ్‌ బై!

Sunil Chhetri Retirement: కాసింత ఉద్వేగం.. ఫుట్‌బాల్ ఆటకు సునీల్ గుడ్‌ బై!

Sunil Chhetri Announced Retirement to Football: ఇండియా జట్టు ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆటకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు. జూన్ ఫస్ట్ వీక్ తర్వాత ఫుట్‌బాల్ నుంచి రిటైర్‌మెంట్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాను పోస్టు చేసిన వీడియోకు ‘ఐ ఉడ్ లైక్ టు సే సమ్‌థింగ్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.


39 ఏళ్ల ఛెత్రి భారత్ తరపున 145 మ్యాచ్‌లు ఆడాడు. 20 ఏళ్ల కెరీర్‌లో 93 గోల్స్ చేశాడు. తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడడం, గోల్ సాధించడం విశేషం. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. రెండు దశాబ్దాలుగా ఆడడం నార్మల్ విషయం కాదు. తాను ఇప్పటికీ మరచిపోలేని రోజు, తొలిసారి దేశం కోసం ఆడినప్పుడని గుర్తు చేసుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో కర్తవ్య ఒత్తిడికి, ఆనందానికి లోనయ్యానని మనసులోని మాట బయటపెట్టాడు. జీవితంలో తాను ఎంతో అదృష్టవంతుడని, కలను విజయవంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తాను చివరి మ్యాచ్ కోల్‌కతా వేదికగా జూన్ ఆరున కువైట్‌‌తో ఆడుతున్నట్లు వెల్లడించాడు.

40 ఏళ్ల సునీల్ ఛెత్రి.. పుట్టింది మాత్రం సికింద్రాబాద్‌లో. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆటపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో కష్టాలు, కన్నీళ్లు లేకపోలేదు. ఫేమస్ అయిన మోహన్ బగాన్ క్లబ్ తరపున 2002లో కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత మూడేళ్లకే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తక్కువ సమయంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.


Also Read: గుజరాత్ కి చెలగాటం… హైదరాబాద్ కి ప్రాణ సంకటం

అంతేకాదు పోర్చుగీస్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో, అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ తర్వాత ఆ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు సునీల్. అవార్డులకు కొదవలేదు. అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న వంటి అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇవికాకుండా మిగతా అవార్డులు చాలానే ఉన్నాయి. ఫిపా ప్రపంచకప్ 2026, ఏఎఫ్‌సీ ఆసియా‌కప్ 2027 కోసం కువైట్ -ఖతార్‌లతో జరిగే ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ మ్యాచ్ జరగనుంది. జూన్ ఆరున కోల్‌కత్తా వేదికగా కువైట్‌తో ఆడనున్నాడు. ఇదే ఛెత్రీకి చివరి మ్యాచ్ అన్నమాట.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×