BigTV English

‘Purushothamudu’ Teaser: ‘వాడు రాముడు కాదు.. పరుశురాముడు..’ ఆకట్టుకుంటున్న పురుషోత్తముడు టీజర్..!

‘Purushothamudu’ Teaser: ‘వాడు రాముడు కాదు.. పరుశురాముడు..’ ఆకట్టుకుంటున్న పురుషోత్తముడు టీజర్..!

Raj Tarun’s Purushothamudu Teaser Out: యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవకాశాలు అయితే అందుకుంటున్నాడు కానీ, విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ రమేష్ తేజావత్ మరియు ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు.


ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన హాసిని సుధీర్ అనే కొత్త అమ్మాయి నటిస్తుండగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద పెద్ద నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడు అయితే.. మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడు అయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న.. ధర్మం ముఖ్యం” అని రాజ్ తరుణ్ చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.

ధర్మం కోసం ఏదైనా చేసే రాముడు లాంటి యువకుడు కథనే పురుషోత్తముడు అని డైరెక్టర్ చెప్పకనే చెప్పుకొచ్చాడు. ఒక గ్రామం కోసం.. అందులో ఉన్న గ్రామస్థులు కోసం డబ్బున్న ఒక కుర్రాడు.. తన అంతస్తును, హోదాను పక్కనపెట్టి ఏం చేశాడు. అతడిని అడ్డుకోవడానికి వచ్చినవారెవరు.. ? ఎందుకు ఆ ఊరి కోసంఅతను అంత చేయాల్సి వచ్చింది.. అసలు ఈ పురుషోత్తముడు ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Also Read: Prabhas Insta Story : వెయిట్ చేయండి డార్లింగ్స్.. మంచి న్యూస్ చెప్తానన్న ప్రభాస్.. పెళ్లి అప్డేటా?

టీజర్ తోనే సినిమాపై హైప్ తీసుకొచ్చారు మేకర్స్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటివారు కూడా ఉండడంతో సినిమాపై బజ్ పెరిగే అవకాశం కూడా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×