Team India : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లుతో టీమిండియా కు మెయిన్ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11 పై నిషేదం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీతో ఇక నుంచి కాంట్రాక్టు కొనసాగించే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 09న ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 09లోపు స్పాన్సర్ దొరక్కపోతే మెయిన్ స్పాన్సర్ లేకుండానే భారత జట్టు టోర్నీలో పాల్గొంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆన్ లైన్ గేమింగ్ బిల్లు చట్టంగా మారితే బీసీసీఐ కొత్త స్పాన్సర్లను వెతుక్కోవడం పెద్ద సమస్య కాదని పలువురు క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read : SA vs AUS 2nd ODI : ప్రపంచ ఛాంపియన్ షిప్ ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
భారత్ క్రేజ్ మామూలుగా ఉండదు..
భారత్ లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. స్పాన్సర్లు కూడా ఎప్పుడూ రెడీగానే ఉంటారు. కానీ ప్లేయర్లకు మాత్రం కాస్త ఇబ్బందులు తప్పవు. చాలా మంది స్టార్ ప్లేయర్లకు ఈ కంపెనీలతో ఇండివిడ్యువల్ గా డీల్స్ ఉంటాయి. ముఖ్యంగా ధోనీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు డ్రీమ్ 11కి.. సౌరబ్ గంగూలీ, శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి వారు మై 11 సర్కిల్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ బిల్లు వల్ల ఆ పర్సనల్ డీల్స్ రద్దు అయ్యే అవకాశం ఉంది. దీంతో క్రికెటర్ల పర్సనల్ డీల్స్ రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో క్రికెటర్ల పర్సనల్ ఇన్ కమ్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దాదాపు చాలా సంవత్సరాల నుంచి టీమిండియా కి సహారా, బైజూస్, డ్రీమ్ 11 వంటివి స్పాన్సర్లుగా ఉన్నాయి. వాటిలో సహారా ఎప్పుడో దివాళా తీసింది. అదేవిధంగా బైజూస్ భారీ నష్టాలనే చవిచూసింది. ప్రస్తుతం డ్రీమ్ 11 ని నిషేదించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.
వారికి భారీగా నష్టాలు..
మరోవైపు టీమిండియా కి స్పాన్సర్స్ చేసిన వారెవ్వరికైనా నష్టాలు తప్పవు అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఆన్ లైన్ గేమింగ్ రంగాన్ని కంట్రోల్ చేయడమే ఈ బిల్లు లక్ష్యం. ఇది చట్టంగా మారితే ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలు క్రికెట్ కి స్పాన్సర్లు ఉండటం కష్టం. దీంతో ఇప్పుడు బీసీసీఐకి పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాకి డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్ గా కొనసాగుతోంది. ఈ డీల్ విలువ రూ.358 కోట్లు. ఇది 2023 నుంచి 2026 వరకు ఉంటుంది. ఐపీఎల్ కి మై 11 సర్కిల్ ఫాంటసీ గేమింగ్ రైట్స్ తీసుకుంది. ఐదేళ్ల కోసం కుదిరిన ఈ డీల్ విలువ రూ.625 కోట్లు. ఈ రెండు కంపెనీల నుంచి బీసీసీఐకి ఏడాదికి వందలకోట్ల ఆదాయం లభిస్తోంది.