BigTV English

Police Jobs: 3588 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? జీతం అక్షరాల రూ.69,100

Police Jobs: 3588 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? జీతం అక్షరాల రూ.69,100

Police Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.


బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి 3588 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 26 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3588 (కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ (మేల్): 3406 పోస్టులు, కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ (ఫిమేల్): 182 పోస్టులు)


బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన డేట్స్…

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 26

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 24

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. మరి అర్హత ఉన్న వారు వెంటనే జులై 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు..

అఫీషియల్ వెబ్ సైట్: https://www.bsf.gov.in/

అర్హత ఉండి ఆసక్తి గల వారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంది. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. మరి అర్హత ఉన్న వారు వెంటనే జులై 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: Jobs in Telangana: తెలంగాణలో 1623 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. రూ.లక్షకు పైగా వేతనం, ఈ అర్హత ఉంటే చాలు..!

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3588

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 24

Related News

IBPS Clerk Jobs: భారీ గుడ్ న్యూస్.. క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఇంకా 6 రోజుల సమయం

Jobs in Telangana: తెలంగాణలో 1623 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. రూ.లక్షకు పైగా వేతనం, ఈ అర్హత ఉంటే చాలు..!

DSSSB Recruitment: అద్భుతమైన అవకాశం.. ఇంటర్ పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..

IBPS Jobs:10,277 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? నేడే లాస్ట్ డేట్..

Indian Army: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ

Big Stories

×