Shivam Dube: క్రికెట్ లో గెలుపు, ఓటములు సర్వసాధారణం. కానీ ఒక ప్లేయర్ ఆడిన మ్యాచ్ లలో మాత్రమే జట్టు వరుస విజయాలను సాధిస్తూ, అతడు జట్టులో లేని మ్యాచ్ లలో ఓడిపోతే మాత్రం ఇది ఆశ్చర్యకరమైన విషయమే. సరిగ్గా ఇలాంటి ఘటనే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే విషయంలో జరిగింది. ఈ ఆల్ రౌండర్ {Shivam Dube} భారత జట్టుకు గోల్డెన్ లెగ్ లా మారాడు. అతడు జట్టులో ఉంటే చాలు విజయం ఖాయం అనేలా ఉంది ఇప్పుడు పరిస్థితి.
Also Read: IND v ENG 2025: టీమిండియా సిబ్బందికి ఘోర అవమానం… బస్సు దగ్గరే ఆపేసి పోలీసులు రచ్చ!
ఇలా శివమ్ దూబే ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లకు సాధ్యం కానీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో దూబే ఆడిన 30 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. 2019 నుండి.. ఇంగ్లాండ్ తో ఇటీవల జరిగిన ఐదు టి-20 ల సిరీస్ వరకు దూబే ప్రాతినిధ్యం వహించిన ఏ మ్యాచ్ లో కూడా భారత జట్టు ఓడిపోలేదు.
ఇలా టి-20 హిస్టరీలో వరుసగా 30 మ్యాచ్ లలో విజయం సాధించిన ఏకైక, తొలి టీమ్ ఇండియా ప్లేయర్ గా శివమ్ దూబే రికార్డ్ నెలకొల్పాడు. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టీ-20 తో దూబే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తరువాత అతడి ఐదవ టి-20 లో సైతం బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమిని చవిచూచింది.
అప్పటి నుండి దూబే ఆడిన ఏ టి-20 మ్యాచ్ లో భారత్ ఓడిపోలేదు. ఈ అరుదైన ఫీట్ సాధించిన దూబేకి ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ అభినందనలు తెలిపింది. “దూబే ఆడితే భారత్ గెలవాల్సిందే. దూబే ఆడిన 30 మ్యాచ్ లలో భారత్ వరుసగా విజయం సాధించింది” అని సీఎస్కే ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చింది. కాగా ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ కి మొదట దూబేకి జట్టులో చోటు దక్కలేదు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గాయపడడంతో దూబేకి జట్టులో అవకాశం దక్కింది.
Also Read: Dimuth Karunaratne: చాంపియన్స్ ట్రోఫీకి కంటే ముందే శ్రీలంకకు షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..!
ఇలా వచ్చిన అవకాశాన్ని దూబే సద్వినియోగం చేసుకున్నాడు. ఇక టి-20 సిరీస్ ముగియడంతో ప్రస్తుతం దూబే ముంబై తరపున రంజీల్లో ఆడబోతున్నాడు. గతంలో ఈ రికార్డు దీపక్ హుడా పేరున ఉండేది. క్రికెటర్ గా అరంగేట్రం చేసిన తర్వాత దీపక్ హుడా ఆడిన 16 మ్యాచ్ లలో టీమ్ ఇండియా విజయాన్ని సాధించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ ఘనతను సాధించిన మొదటి క్రికెటర్ గా దీపక్ హుడా నిలిచాడు. ఇప్పుడు అతని రికార్డ్ ని బ్రేక్ చేస్తూ శివమ్ దూబే ఆడిన 30 మ్యాచ్ లలో భారత్ ఘనవిజయాన్ని సాధించింది.
Shivam Dube's Supremacy 🔥🤞🏻 pic.twitter.com/OqRy2qztmw
— RVCJ Media (@RVCJ_FB) February 4, 2025