IND v ENG 2025: ఇంగ్లాండ్ తో ఐదు టి-20 ల సిరీస్ ని 4 – 1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం వన్డే సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 6 గురువారం నాగపూర్ లో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆదివారం రోజు రాత్రి నాగపూర్ కి చేరుకుంది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ సహా పలువురు ప్లేయర్లు నాగపూర్ విమానాశ్రయంలో దిగి.. నేరుగా వారు బస చేస్తున్న హోటల్ కి వెళ్లారు.
Also Read: Dimuth Karunaratne: చాంపియన్స్ ట్రోఫీకి కంటే ముందే శ్రీలంకకు షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..!
అయితే టీమిండియా ఆటగాళ్లు నాగపూర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం లోకి రాగానే.. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గుమిగూడారు. మొదట విరాట్ కోహ్లీ ఏయిర్ పోర్ట్ లో కనిపించగానే ఫ్యాన్స్ కేకలు పెట్టారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఇతర ఆటగాళ్లు కూడా అక్కడి నుంచి హోటల్ కి చేరుకున్నారు. అయితే హోటల్ కి చేరుకున్న సమయంలో టీమిండియా సిబ్బంది ఒకరికి వింత అనుభవం ఎదురైంది.
టీమిండియా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అభిమానిగా భావించి జట్టు బస చేస్తున్న హోటల్ లోపలికి ప్రవేశించకుండా కొద్దిసేపు నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సు నుంచి దిగి హోటల్లోకి వెళ్లే క్రమంలో.. త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘును అభిమానిగా భావించిన పోలీసులు లోపలికి అనుమతించలేదు.
దాంతో అతడు తాను జట్టు సభ్యుడినని పోలీసులను ఒప్పించడానికి ప్రయత్నించాడు. అలా కాసేపు అతడిని నిల్చోబెట్టిన తర్వాత.. తమ తప్పు తెలుసుకున్న నాగపూర్ పోలీసులు రఘు ని హోటల్ లోనికి అనుమతించారు. దీంతో అక్కడే వీడియోలు తీస్తున్న అభిమానులు కాసేపు నవ్వుకున్నారు. ఇక ఈ సిరీస్ లోని మొదటి వన్డే 6వ తేదీన నాగపూర్ లో జరిగితే, రెండవ వన్డే 9న కటక్, మూడవ వన్డే 12న అహ్మదాబాద్ లో జరుగుతుంది.
Also Read: IND Vs ENG ODI 2025: వన్డే సిరీస్ టైమింగ్స్.. ఉచితంగా ఎలా,ఎక్కడ చూడాలంటే..?
ఇక ఈ సిరీస్ కోసం హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు. జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ సిరీస్ కోసం బలమైన జట్టును ప్రకటించింది. ముఖ్యంగా జో రూట్ వన్డే టీమ్ లోకి తిరిగి వచ్చాడు. ఇక తొడ కండరాల గాయం కారణంగా బెన్ స్టోక్స్ లేకపోవడం ఇంగ్లాండ్ కి కాస్త ఎదురుదెబ్బే. అత్యంత కీలకమైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు మంచి ప్రాక్టీస్ గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
GOAT Raghu of Indian cricket team was denied entry by Nagpur police 😂
Nagpur police guarding Rohit Sharma's boys too strictly 😎 pic.twitter.com/iko9TTD0hP
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) February 4, 2025