BigTV English
Advertisement

Ind vs Nz: నేడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌…రోహిత్, షమీ లేకుండానే బరిలోకి!

Ind vs Nz: నేడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌…రోహిత్, షమీ లేకుండానే బరిలోకి!

Ind vs Nz: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య… గ్రూప్ స్టేజీలో చివరి మ్యాచ్ ఇవాళ నిర్వహించబోతున్నారు. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ… ఈ మ్యాచ్ ఫలితం సెమీఫైనల్ మ్యాచ్లను డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే న్యూజిలాండ్ అలాగే టీమిండియా రెండు కూడా సెమీఫైనల్ కు వెళ్లాయి. గ్రూప్ బి లో సెమీఫైనల్ కు చేరిన ఆస్ట్రేలియా అలాగే దక్షిణాఫ్రికా రెండు జట్లతో.. టీమిండియా అలాగే న్యూజిలాండ్ తలపడాల్సి ఉంటుంది.


Also Read: Sa Vs Aus: పాకిస్తాన్ నుంచి దుబాయ్ పారిపోయిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా… కారణం ఇదే?

సెమీ ఫైనల్ సినారియో 


చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా  సెమీ ఫైనల్ 1 లో ఎవరు తలపడాల్సి ఉంటుంది..? సెమీఫైనల్ 2 లో ఏ రెండు జట్లు పోటీ పడతాయి…? అనేది తెలియాలంటే ఇవాల్టి ఫలితం పైన ఆధారపడి ఉంటుంది. ఇందులో… టీమిండియా గెలిస్తే… ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. అదే న్యూజిలాండ్ గెలిస్తే… టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య సెమీఫైనల్ ఉంటుంది. ఇలా ఇవాల్టి మ్యాచ్ ఫలితం పైన సెమీఫైనల్ లెక్కలు తేలుతాయి.

రోహిత్‌ శర్మ, షమీ దూరం ?

ఇవాళ్టి మ్యాచ్‌ లో రోహిత్‌ శర్మ, షమీ దూరం కాబోతున్నారట. వాళ్ల ఇద్దరికీ రెస్ట్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట. రోహిత్‌ శర్మ, షమీ దూరం  అయితే.. వాళ్ల స్థానంలో రిషబ్ పంత్, అర్షదీప్ వస్తారు.

మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?

దుబాయ్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. అలాగే…. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఎట్లా మధ్య మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగా మనం చూడవచ్చు. జియో కస్టమర్ లందరికీ ఉచితంగానే చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లైవ్ అందిస్తోంది జియో. అలాగే స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 చానల్స్ లో కూడా మనం మ్యాచ్ చూడవచ్చు.

టీమిండియా VS న్యూజిలాండ్  వన్డే రికార్డులు

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య వన్డే రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… రోహిత్ సేన ది పై చేయిగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య 118 వన్డే మ్యాచ్లు జరిగాయి. అయితే ఇందులో 60 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. మిగతా 50 మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించడం జరిగింది. అంటే దాదాపు పది మ్యాచ్లలో … వినింగ్ పర్సంటేజ్ టీమ్ ఇండియాకు ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఇవాళ టీమిండియా గెలిస్తే… మొన్న టెస్ట్ ల్లో గెలిచిన న్యూజిలాండ్ పైన ప్రతికాలం తీర్చుకున్నట్లు అవుతుంది.

Also Read: SA vs ENG: 179 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్‌..సెమీస్‌ లోకి దక్షిణాఫ్రికా ఎంట్రీ ?

భారత్ , న్యూజిలాండ్ ప్లేయింగ్ XIల అంచనా

భారత్: రోహిత్ శర్మ (C) / రిషబ్ పంత్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మరియు అర్ష్‌దీప్ సింగ్/ షమీ.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (WK), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (C), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, విల్ ఓ’రూర్క్.

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..వాష్టింగ‌న్ మ్యాజిక్‌..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×