BigTV English
Advertisement

Sa Vs Aus: పాకిస్తాన్ నుంచి దుబాయ్ పారిపోయిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా… కారణం ఇదే?

Sa Vs Aus: పాకిస్తాన్ నుంచి దుబాయ్ పారిపోయిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా… కారణం ఇదే?

Sa Vs Aus: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు జట్టు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. గ్రూప్ ఏ లో టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్లు రెండు కూడా మొన్ననే సెమి ఫైనల్ కు చేరుకున్నాయి. ఇక ఇవాళ గ్రూపు బీలో… సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ రెండు జట్లు కూడా… సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఛాంపియస్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… పాకిస్తాన్ లో నిర్వహించినప్పటికీ… హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. అంటే.. టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్ లో నిర్వహిస్తారు అన్నమాట. ఛాంపియన్ టోపీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకుంది.


Also Read: SA vs ENG: బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లాండ్‌..కర్మకాలి ఓడితే సౌతాఫ్రికా ఇంటికే ?

పాయింట్స్ టేబుల్ లో నాలుగు దక్కించుకున్న టీమిండియా.. గ్రూప్ A లో రెండవ స్థానంలో నిలిచింది. అలాగే న్యూజిలాండ్ టీం కూడా క్వాలిఫై అయింది. న్యూజిలాండ్ ఖాతాలో +0.863 రన్ రేట్ కలిగి ఉంది. అందుకే గ్రూప్ ఏ లో మొదటి స్థానంలో నిలిచింది న్యూజిలాండ్. అయితే ఇక్కడ న్యూజిలాండ్ కంటే తక్కువ టీమిండియా రన్ రేట్ కలిగి ఉంది. దీంతో రెండో స్థానంలో నిలిచింది టీమిండియా.


అయితే ఆదివారం రోజున.. అంటే మార్చి రెండవ తేదీన… న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య లీగ్ చివరి దశ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు… మొదటి స్థానాన్ని దక్కించుకుంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు పడతాయి. ఒకవేళ టీమ్ ఇండియా గెలిస్తే ఆరు పాయింట్లు దక్కించుకుంటుంది. అలాకాకుండా దుబాయ్ లో వర్షం పడి మ్యాచ్ రద్దు అవుతే.. చెరొక పాయింట్ వస్తుంది. అప్పుడు న్యూజిలాండ్ అలాగే టీమిండియా ఖాతాలో చెరో ఐదు పాయింట్లు వస్తాయి.

అయితే రేపటి మ్యాచ్ వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల రద్దు అయితే… అప్పుడు కూడా న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే టీమిండియా కంటే న్యూజిలాండ్ ఖాతాలో రన్ రేట్ ఎక్కువ ఉంది. అటు గ్రూప్ బి లో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. ఐదు పాయింట్లతో… గ్రూపు బీలో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో… రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు మ్యాచ్లు ఇకపైన లేవు కాబట్టి… ఈ రెండు జట్లు అదే స్థానంలో ఉంటాయి.

Also Read: Mohammad Rizwan: పాకిస్థాన్ టీంలో భూకంపం.. కెప్టెన్ పదవికి రిజ్వాన్ రాజీనామా ?

ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం గ్రూప్ ఎ అలాగే గ్రూప్ బి లో జట్లు అదే స్థానాన్ని దక్కించుకుంటే… సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి సెమీఫైనల్ ఉండే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు సెమీఫైనల్ 2 లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉంటుందట. అయితే ఈ సెమీఫైనల్ సినారియో ఫైనల్ కాకముందే… పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా రెండు జట్లు కూడా దుబాయ్ వెళ్లిపోయాయి. ఇప్పటికే దుబాయ్ లోనే న్యూజిలాండ్ జట్టు ఉంది. పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే… విదేశీ జట్లన్నీ దుబాయ్ కి చేరుకున్నాయి. ఒకవేళ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగితే… ఈ రెండు జట్లు సెమీఫైనల్ మ్యాచ్ ను పాకిస్తాన్లో ఆడతాయి. టీమిండియాతో ఆడే జట్టు మాత్రం దుబాయిలో తలపడుతుంది.

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×