T20 World Cup 2025: అండర్ – 19 మహిళల టి-20 ప్రపంచ కప్ ఫైనల్ కి దూసుకెళ్లింది టీమ్ ఇండియా. సెమీ ఫైనల్ 2 లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 15 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. మ్యాచ్ మొదలైన సమయంలో ఓపెనర్ జమీమా గ్రీస్ రెండు ఫోర్లతో సహ మొత్తం 9 పరుగులు చేసి భారీ స్కోర్ చేసేలా కనిపించింది.
Also Read: Virat Kohli Wicket: రంజీ బౌలర్ చేతిలో కోహ్లీ క్లీన్ బౌల్డ్.. సాంగ్వాన్ సెలబ్రేషన్స్ అదరహో !
కానీ వెంటనే భారత బౌలర్లు హడలెత్తించారు. ఆయుష్ శుక్ల.. జెనీమా గ్రీస్ ని 9 పరుగులకే పెవిలియన్ చేర్చి ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికింది. ఆ తరువాత డెవినా పెరిన్ (45), కెప్టెన్ అబి నోర్ గ్రోవ్ 30, సురేన్ కుమార్ 14 మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరు రెండంకల స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3, పరిణికా 3, ఆయుషి 2 వికెట్లు పడగొట్టారు. ఇక చేజింగ్ లో భారత ఓపెనర్ కమలిని హాఫ్ సెంచరీ తో చెలరేగింది.
50 బంతులలో 56 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది. ఇక తెలుగు అమ్మాయి గొంగడి త్రిష 35, సానిక 11 పరుగులతో రాణించడంతో భారత జట్టు 15 ఓవర్లలోనే టార్గెట్ ని ఛేదించింది. ఇక ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడబోతోంది భారత మహిళా జట్టు. ఆస్ట్రేలియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన సెమీ ఫైనల్ 1 లో సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టుని 105 పరుగులకే కట్టడి చేసింది సౌత్ ఆఫ్రికా మహిళా జట్టు. అనంతరం 18.1 ఓవర్లలోనే టార్గెట్ ని చేజ్ చేసింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చేదించేందుకు సఫారీ జట్టు చెమటోడ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 105 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా బౌలర్ ఆప్లే వాన్ వైక్ 17 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చి ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టింది. అనంతరం సౌత్ ఆఫ్రికా 18.1 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి అతి కష్టం మీద విజయం సాధించి ఫైనల్ కీ చేరింది.
Also Read: Moin Khan on Indian Players: టీమిండియా ప్లేయర్లతో దోస్తానా వద్దు.. బార్డర్ లో శత్రువుల్లా చూడండి ?
ఈ టోర్నీలో భారత బ్యాటర్లు తొలి మ్యాచ్ నుండే మంచి ఫామ్ కనబరుచుతున్నారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. దీంతో భారత టీమ్ ఫైనల్ కి దూసుకు వెళ్ళింది. ఈ కప్ లో వరుస విజయాలను సాధించిన భారత మహిళా యువ జట్టు ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై గెలిచి కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం జరగనున్న ఈ టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా తో భారత్ తలపడనుంది.
ENG-W:- 113/8 (20)
IND-W:- 117/1 (15)India women won by 9 wickets
A scintillating match winning knock of 5️⃣6️⃣ from G Kamalini helps the defending champions to secure a clinical win over England women 🔥🏏
📷:- Disney+ Hotstar #INDWvENGW #WomensCricket #U19T20WorldCup… pic.twitter.com/trKMjXOCVW
— InsideSport (@InsideSportIND) January 31, 2025