Damodar Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. భవన నిర్మాణానికి సుమారు రూ.2500 కోట్ల నుంచి రూ.2700 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా.
ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం, తెలంగాణ సమాజం చాలా సంతోషిస్తున్న రోజు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల కల సహకారం చేసేందుకు కృషి చేశాం అన్నారు. ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ భవనం.. కోర్టులో కేసు వల్ల లేట్ అయిందని, ప్రస్తుతం 26 ఎకరాల విస్తీర్ణంలో 2000 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 8 కొత్త డిపార్ట్మెంట్స్ మొత్తంగా 40 డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశాం అన్నారు.
ఏ మారుమూల ప్రాంతం నుండి వచ్చినా ఈ డిపార్ట్మెంట్ లేదు అని నిరాశ చెందకూడదు అని.. అన్ని డిపార్ట్మెంట్స్ నిర్మించాం అని ఈ సందర్బంగా తెలియజేశారు. భవన నిర్మాణానికి సుమారు రూ.2500 కోట్ల నుంచి రూ.2700 కోట్ల నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని వస్తాం అని రాజనర్సింహ వెల్లడించారు.
చుట్టు ప్రక్కల వారికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా నాలుగు వైపులా రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తాం అన్నారు. భవిష్యత్తులో మిగితా హెలి అంబులెన్స్ నిర్మాణం చేపడుతాం అని తెలిపారు. ఉన్న 38 ఎకరాల్లో 26 ఎకరాలు తీసుకున్నాం అని, ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హాస్పటల్ నిర్మాణం తరువాత చిరు వ్యాపారం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హాస్పటల్ చుట్టూ స్కైవాక్ నిర్మాణం చేపడతామన్నారు. ఎప్పుడైనా ప్రజా అభిప్రాయం గౌరవిస్తాం అని పేర్కొన్నారు.
Also Read: ప్రతి ఒక్కరికీ సత్వర వైద్యం.. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన
ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్‌కు ప్రత్యేకంగా హాస్టల్ భవనాల నిర్మాణానికి సూచనలు చేశాం అన్నారు. పార్కింగ్, ల్యాండ్ స్కేప్ విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైనచోట ఇతర మార్గాలను కలిపేలా అండర్‌పాస్‌లు నిర్మించేలా చేస్తామని వెల్లడించారు.