Virat Kohli Wicket: గురువారం (జనవరి 30) నుండి రైల్వేస్ – ఢిల్లీ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రంజి మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. పుష్కరకాలం తరువాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశవాళీలోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ కోసం ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో రైల్వేస్ 241 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. రైల్వేస్ బ్యాటర్లలో ఉపేంద్ర యాదవ్ 95, కర్న్ శర్మ 50 పరుగులతో రాణించారు. రైల్వేస్ బౌలర్లలో నవదీప్ షైనీ 3, సిద్ధాంత్ శర్మ 2, గ్రేవల్ 2, సుమిత్ మతుర్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ జట్టు బ్యాటర్లలో అర్పిత్ రానా (10), సంగ్వాన్ (30), దుల్ (32) పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
అయితే 13 సంవత్సరాల తరువాత దేశవాళీలో పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ లో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. దూల్ అవుట్ కావడంతో సెకండ్ డౌన్ లో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సంగ్వాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నిరాశగా బయటికి వెళ్ళిపోతున్నారు.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి వస్తుండగా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. కానీ వారందరి ఆశలను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. సంగ్వాన్ బౌలింగ్ లో ఆఫ్ స్టంప్ ఎగిరి పడింది. లైన్ అండ్ లెంగ్త్ బంతిని ఆడడంలో విఫలమైన విరాట్ కోహ్లీ తన వికెట్ ని సమర్పించుకున్నాడు. దీంతో సంగ్వాన్ కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Rohit Sharma: రోహిత్ దెబ్బ అదుర్స్.. ఆ ఈవెంట్ రద్దు చేసుకున్న పాకిస్తాన్ !
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన విరాట్ కోహ్లీ.. దేశవాళీ క్రికెట్ లో బరిలోకి దిగి విఫలమైన స్టార్ బ్యాటర్ల తాజా జాబితాలో చేరిపోయాడు. ఇంతకుముందు రౌండ్ మ్యాచ్లలో రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేకపోయారు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు 168 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ ఆయుష్ బదోని (52*), సుమిత్ మథుర్ (28*) క్రీజ్ లో ఉన్నారు. రైల్వేస్ బౌలర్లలో సంగ్వాన్ 2, కునల్ యాదవ్ 1, రాహుల్ శర్మ 1 వికెట్లు పడగొట్టారు.
Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb
— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025